చెరకు ముక్కల ప్యాకెట్…
1 min read
AABNEWS : ఇది రిలయన్స్ బజారులో దొరికే చెరకు ముక్కల ప్యాకెట్..
చెరకును తొక్కతీసి ముక్కలు చేసి ప్యాకెట్లో పెట్టి అమ్మడం కూడా మొదలెట్టేశారు..200 గ్రాముల చెరకు ముక్కల ప్యాకెట్ 30రూపాయలు..ఈ లెక్క ప్రకారం ఒక కేజీ చెరకుముక్కలు 150రూపాయలు వందకేజీలు అంటే ఒక క్వింటాల్ ధర 15000వేల రూపాయలు.మన రైతులేమో క్వింటాల్ చెరకు 2500 రెండువేల ఐదువందలు మద్దతు ధర కూడా లేక రాక ఈరోజు రోడ్డెక్కారు. కార్పొరేటర్ల ధందా ఇలాగే కొనసాగితే ఒక అరటిపండు నాలుగు ముక్కలుచేసి ప్యాక్ చేసి 40రూపాయలకు అమ్మతారు..
ఈరోజు డజను అరటిపండ్లు 40రూపాయలకు కొనడానికి ఏడ్చే మనం… రేపు ఒక అరటిపండు 40రూపాయలకు కొని నలుగురూ నాలుగు ముక్కలు తినే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరచి రైతులకు మద్దతు ఇవ్వండి..
లేకపోతే బియ్యం గింజలు కూడా డజన్ల లెక్కలో కొనాల్సివస్తుంది.
244 Total Views, 4 Views Today