జగనన్నకు సోషల్ మీడియా సైన్యం తోడుగా…
1 min read
AABNEWS : శ్రీరాములవారికి వానర సైన్యం కష్టసుఖాల్లో ఎలాగ తోడుగా నిలిచారో , నేడు జగనన్నకు సోషల్ మీడియా సైన్యం తోడుగా నిలుస్తుంది – ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ గారు. ఈనెల 28వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాళహస్తి కి విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా సోషల్ మీడియా సైనికులతో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,శ్రీరాములవారికి వానర సైన్యం కష్టసుఖాల్లో ఎలాగ తోడుగా నిలిచారో ,నేడు జగనన్నకు కష్టసుఖాల్లో సోషల్ మీడియా సైన్యం తోడుగా నిలుస్తునందుకు నిజంగా వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.జగనన్న పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ, మరెన్నో అవమానాలు భరిస్తూ జగనన్నకి తోడుగా నిలబడి నేడు దేశంలోనే రెండో స్థానంలో మన సోషల్ మీడియా ఉందంటే దాని వెనుక మీ కృషి మీ కష్టం మాటల్లో చెప్పలేను. 2019 ఎన్నికల సమయంలో మీరు పడ్డ కష్టం, మీరందరూ ఒక టీవీ ఛానెల్ లాగా తయారై ప్రజలకు నిజానిజాలు తెలియజేశారు.అలాగే మీ అందరికీ ఏ సహాయం కావాలన్నా ఇంట్లో ఒక అన్న లాగా నాకు తెలియజేయండి నా వంతు ఉడతా భక్తి సాయంగా మీకు సహాయం చేస్తాను.మనమందరం జగనన్న కుటుంబ సభ్యులకు అలాగే జగనన్నకు సోషల్ మీడియా లో కష్టపడుతున్న మీరంటే చాలా చాలా ఇష్టం. ఒకప్పుడు న్యూస్ పేపర్లు కోసం ఎదురు చూసే వాళ్ళు కానీ నేడు ఆ పరిస్థితి లేదు ఎక్కడ ఏమి జరిగినా నిమిషాల్లో మన ముందుకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే ఈనెల 28వ తేదీన పేద అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడం కోసం జగనన్న మన శ్రీకాళహస్తి వస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా మన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరు చెప్పిన సమస్యలన్నింటిని జగనన్న దృష్టికి ఖచ్చితంగా తీసుకు వెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యల కృష్ణారెడ్డి గారు మరియు చిత్తూరు జిల్లా సోషల్ మీడియా సైనికులు పాల్గొన్నారు.
168 Total Views, 2 Views Today