September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న…

1 min read

AABNEWS : జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న జనసేన అభిమాని భార్గవ్ ను ఈ రోజు రాత్రి అతని స్వగృహంలో పరామర్శించారు. వైద్యం కోసం రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు.భార్గవ్ కు ధైర్యాన్ని చెప్పి వెండి గణపతి విగ్రహాన్ని అందించారు.
అతని తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రస్తుతం భార్గవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడారు.
మూడు నెలల కిందటే క్యాన్సర్ నిర్ధారణ అయిందని తెలిపారు.
జనసేన పార్టీ నుంచీ వైద్యులను పంపిస్తామని తగిన సేవలు అందిస్తారని తెలిపారు.
ఎన్.ఆర్.ఐ. దాతల నుంచి సహాయం అందేలా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తాయి అని శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు.

 686 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.