AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో ఈ రోజు అన్నార్తులకు పేదలకు అన్న దాన కార్యక్రమమ…

1 min read

AABNEWS ; చిలకలూరిపేట సుబ్బయ్యతోట లో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో వేంచేసి యున్న దత్తాత్రేయ స్వామి సన్నిధిలో ఈ రోజు గురువారం దశమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపి,పేదలకు కరోనా వ్యాధి పరిస్థితులు కారణముగా ఇబ్బంది పడుతున్నవారికి 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి మాట్లాడుతూ మనం చేసిన దాన ధర్మాలు మాత్రేమే మనము అపదలలో ఉన్నప్పుడు మనల్ని కాపాడతాయి అని,ఆకలిగా ఉన్న జీవికి అన్నం పెట్టడం ఆ పరమాత్మ కి నేరుగా చెందుతుంది అని,మనం వెళ్ళేటప్పుడు పాప పుణ్యాలు మాత్రమే మనతో వస్తాయి అని, భగవంతుని కి 100 అలంకరణలు చేసి,బంగారు,వెండి వస్తువులు సమర్పించిన అది అన్నదానం తో సరి కాదని మహర్షులు తెలియ చేసారని, సద్గురువుల సన్నిధి లో చేసే అన్నదానం కోటి రేట్లు ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు,ఈ కార్యాక్రమం లో రాము తదితర భక్తులు పాల్గొన్నారు

 1,405 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.