AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జర్నలిస్ట్ యూనియన్ల హక్కులను దెబ్బతీసే ప్రయత్నం…

1 min read

AABNEWS: రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు జీవోలు ఇచ్చి జర్నలిస్ట్ యూనియన్ల హక్కులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. సోమవారం స్థానిక జాబ్ ధర్నా చౌక్ లో ఏపీయూడబ్ల్యూజే కృష్ణ అర్బన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహించే యూనియన్లకు అక్రిడేషన్ కమిటీలో స్థానం లేకుండా చేయడం సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. సుమారు రెండున్నరేళ్లుగా సమాచార శాఖ అధికారులు అక్రిడేషన్లు ఇవ్వలేక పాత అక్రిడిటేషన్లు కొనసాగించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించిన ఒక్క బెనిఫిట్ కూడా ఈ కొత్త ప్రభుత్వం చేయలేదని అనేక సార్లు కలిసి అధికారులకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేదని ఆయన విమర్శించారు. హెల్త్ కార్డు, బీమా సౌకర్యాల అమలు కూడా సక్రమంగా లేదని ఆయన విమర్శించారు.జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కి ఎంత నిధులు వచ్చాయో సమాచార శాఖ అధికారులు లెక్కలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత వెల్ఫేర్ ఫండ్ కి డబ్బు కట్టాలని యూనియన్ ని అధికారులు ఎప్పుడూ అడగలేదని ఆయన తెలిపారు. కానీ డబ్బు కట్ట లేదనే సాకుతో ఆరు అప్లికేషన్లు అధికారులు పెండింగ్ లో పెట్టడం అన్యాయమని ఆయన అన్నారు. ప్రస్తుతం సంక్షేమ నిధి ఎంత ఉందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.చిన్న పత్రికలను సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వమే వాటిని విస్మరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేది నిజంగా చిన్న పత్రిక లేనని ఆయన చెప్పారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల లో కోత వేయాలనే ప్రభుత్వ ఆలోచన సరైనది కాదని ఆయన అన్నారు. గత కొంతకాలంగా ఐఅండ్ పిఆర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిద్రపోతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళనీయకుండా సమాచార శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. పాత హక్కులను రక్షించుకోవడానికి ఉద్యమం చేయాల్సి రావడం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జర్నలిస్టులకు సంబంధించిన ప్రతి ప్రయోజనం కూడా ఏపీయూడబ్ల్యూజే పోరాటాలతోనే సాధించామని ఆయన గుర్తు చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ మాట్లాడుతూ అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టులకు భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన, ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులకు అనుకూలంగా సానుకూలమైన నిర్ణయాలతో రాకపోతే త్వరలో రాష్ట్ర స్థాయిలో మరో ఆందోళనకు కార్యచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. చిన్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా, అక్రిడేషన్లు తగ్గించే ప్రయత్నాన్ని ఆయన ఖండించారు.జర్నలిస్టుల హెల్త్ కార్డులు, బీమా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం గర్హనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే కృష్ణ అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షత వహించగా apuwj ఉపాధ్యక్షులు కంచల జయరాజ్, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మ రాజు చలపతిరావు, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకుడు ఎస్ కె బాబు, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, రామారావు, విజయవాడ చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు ఎం వి సుబ్బారావు, మురళి, ఏ ఎన్ ఎస్ న్యూస్ రంగారావు, నీలి మేఘం శ్రీనివాస్, నగర భేరి జగదీష్, తదితరులు ప్రసంగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాధ్,బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేణు మాధవ్, కాంగ్రెస్ నాయకులు బేకింగ్ తదితరులు ధర్నా కు సంఘీభావం తెలియజేసి ప్రసంగించారు.

 152 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.