AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన అభిమానం…

1 min read

AAB NEWS : మండపేట:-  ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కు జనం బ్రహ్మరథం పట్టారు.
అడుగడుగునా జన నీరాజనం పలికారు. తొలి సారి జిల్లా కు విచ్చేసిన తోట త్రిమూర్తులు విజయోత్సవ
ర్యాలీ జనసంద్రం గా మారింది. మండపేట లో
భారీ క్రేన్ తో పూలహారం తో ఆయన ను సత్కరించటం విశేషం. నిర్విరామంగా కాల్చినబాణసంచా ప్రత్యేకం గా నిలిచింది. రావులపాలెం నుండి వెంకటాయపాలెం వరకుదారి పొడవునా పూలవర్షం కురిపించారు. వివాదాలు ఎన్ని ఉన్నా అదే క్రేజ్ ఆయన సొంతం చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గం లోతరగని జన ఆదరణ లభించింది.జిల్లా నలుమూలల నుండి ముఖ్యంగా కోనసీమ నుండి అశేష జన వాహిని తరలి వచ్చింది. అభిమానం చాటు కొనేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు.ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి జిల్లాకు విచ్చేసిన ఆయనకి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం రావులపాలెం నుండి భారీ ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు. రావులపాలెం సెంటర్ కు భారీ సంఖ్యలో చేరిన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కారులు, మోటార్సైకిళ్ళు తో ఆయన ఊరేగింపు కాన్వాయ్ సాగింది. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు  ఆయనకు శుభాకాంక్షలు  తెలియజేశారు. అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. ప్రతి కూడలి లోనూ పూలమాలలు వేసి దుశ్శాలువా లు కప్పి సత్కరించారు.కడియం నుండి వచ్చిన పూలతో దారి పొడవునా ఆయన పై వర్షం లా కురిపించారు.  జొన్నడ, అలమురు, కొత్తూరు సెంటర్, గుమ్మిలేరు, మండపేట, విరభద్రపురం,పులగుర్త, మాచవరం, పసలపుడి , రామచంద్రపురం, ద్రాక్షరామ, వెంకటాయపాలెం వరకు ఒకే జోరు…హుషారు గా స్వాగత సత్కారం లభించింది. మండపేట కలవపువ్వు సెంటర్ వద్ద వైయస్సార్ సిపి జిల్లా మైనార్టీ విభాగం కార్యదర్శి తోట త్రిమూర్తులు ప్రధాన అనుచరుడు సయ్యద్ రబ్బానీ , ఆయన సోదరులు ఆధ్వర్యంలో భారీ క్రేన్ తో అత్యంత భారీ పూల మాలలు తోట త్రిమూర్తులు వేసి సత్కరించారు. ప్రత్యేకంగా రూపొందించిన పులా కిరీటాన్ని ధరింపజేసారు. ఆద్యంతం జనసంద్రంగా మారిన ఊరేగింపు లో క్రేన్ తో భారీ పూల హారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.వైస్సార్ సిపి నేత గంగుమళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో భారీ బాణా సంచా కాల్పులు విశేషం గా నిలిచిందిఈ సందర్భంగా తోట మాట్లాడుతూ  ప్రజలందరిని కాపు కాస్తానని హామీ ఇచ్చారు. అందరికీ అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. మండపేట వాణి మహల్ కరాచీ సెంటర్ వద్ద వైస్సార్ సిపి నాయకులు ముక్కా సుబ్రహ్మణ్యం, దలియ్య ల నేతృత్వంలో భారీ స్వాగతం ఏర్పాటు చేశారు. ఆయనను ఘనంగా సత్కరించారు. గారడీ నృత్యాలు, బ్యాండు మేళతాలతో కార్యకర్తలు సందడి చేశారు.అభిమానులు కోలాహలం తో ఊరేగింపు ఉత్సాహం గా సాగింది. కలవపూ సెంటర్ వద్ద భారీ స్థాయిలో బాణసంచా కాల్చి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్ సిపి నేతలు కర్రీ పాపారాయుడు, వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, చైర్మన్ పతివాడ నుక దుర్గా రాణి, యువనేత తోట పృథ్వి రాజ్, వైఎస్సార్సీపీ నాయకులు కొమ్ము రాంబాబు, శిరంగు శ్రీనివాస్ మీగడ శ్రీనివాస్ , కార్యకర్తలు, అభిమానులు, కౌన్సిలర్ లు, ప్రజలు పాల్గొన్నారు.

 3,502 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.