AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జూలై 1వ తేది న ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్వినిని హత్య చేసిన..

1 min read

AAB NEWS : గూడూరు పట్టణం : 2వ పట్టణంలో జూలై 1వ తేది న ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్వినిని హత్య చేసిన ప్రేమోన్మాది గునిశెట్టి వెంకటేశ్వర్లుకు న్యాయ సహాయం అందించకుండా గూడూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు తీర్మానం చేయాలని కోరుతూ వినతి పత్రం అందించిన గూడూరు పట్టణ ఐక్య వేదిక… మీడియాతో మాట్లాడుతూ… ప్రేమోన్మాది వెంకటేశ్వర్లు పక్కా ప్రణాళిక తో తేజస్విని ని హత్య చేసాడని, హంతకుడికి చట్టపరంగా కఠినమైన శిక్ష త్వరితగతిన పడాల్సిన అవసరం ఉందని, దానికి గౌరవనీయులైన న్యాయవాదులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేసారు. దయ యుంచి ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయిని పాశవికంగా హత్య చేసి, అందమైన ఆమె కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపిన ప్రేమోన్మాది గునిశెట్టి వెంకటేశ్వర్లుకు బెయిల్ కొరకైతే నేమి, ఇతరత్రా ఎలాంటి న్యాయసహాయం అందించకుండా, ఏ న్యాయవాది సదరు హంతకుని పక్షాన వాదించకుండ మానవతా దృక్పధంతో వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ CPI అధ్యక్షులు కాలేష, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, టీడీపీ గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇశ్రాయేల్ కుమార్, BSP నాయకులు భాస్కర్ గౌడ్, CPM నాయకులు మణి, మాజీ కౌన్సిలర్లు చంద్రయ్య, గురవయ్య, టీడీపీ తిరుపతి పార్లమెంట్ మహిళ కమిటీ కార్యదర్శి గుండాల భారతి, నియోజకవర్గ మహిళ కమిటీ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, మాలమహానాడు నాయకులు పల్లి కోటేశ్వరరావు, ఇన్సాబ్ కమిటీ సభ్యులు అన్వర్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు ,పిల్లెళ్ళ శ్రీనివాసులు,శివ ప్రసాద్ గౌడ్, మల్లికార్జున్,అల్లం వెంకటసాయి తదితరులు పాల్గొన్నారు.

 538 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.