AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జొన్న పంట కొనుగోలు చేయలని ఇంచార్జి కలెక్టర్ కు వినతి…

1 min read

AAB News : ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ రాహుల్ రాజ్ ను బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ లో ఇంచార్జి కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే బోథ్ కనుగుట్టలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రైతులు చాలా ఆందోళనలో ఉన్నారని, ఒకవైపు పంట ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి రాగా జిల్లాలో 34 వేల ఎకరాల్లో పంట వేశారన్నారు. జిల్లాలో దాదాపు నాలుగు, ఐదు లక్షల క్వింటాళ్ల పంట వచ్చిందని, ఖరీఫ్ లో పింక్ బోల్ సోకి పత్తి తొలగించి జొన్న వేశారని గుర్తు చేశారు. బోథ్ నియోజక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత సాగులో భాగంగా మొక్కజొన్నకు బదులు జొన్న వేసి రైతులు పంటను అమ్మకుందామంటే ప్రైవేట్ లో 15 వందలతో అమ్మి నష్ట పోయే పరిస్థితి ఉందన్నారు. ఇంట్లో ఉంచుకునే పరిస్థితి లేక, అకాల వర్షాలు పడి కళ్లముందే పంట నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వానికి ఈ పరిస్థితి నీ వివరించి జొన్నలు కొనుగోలు చేయించగలారని కోరారు. ఖరీఫ్ సీజన్ పనులు కూడా మొదలుపెట్టే సమయం దగ్గర పడుతుందని, కాబట్టి రైతుల దగ్గర ఉన్న జొన్న పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగరపు బోర్రన్న, బీజేపీ నాయకులు ప్రవీణ్ అగర్వాల్, అనిల్ పాల్గొన్నారు.

 517 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.