తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత…
1 min read
AAB NEWS : తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెదేపా కార్యాలయంలో ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు పై తీవ్రంగా విమర్శించారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు రాక సందర్భంగా సమావేశం నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారు కార్యాలయంలో అంబేద్కర్ ఫోటోకు పూల మాలల వేసి హారతిచ్చి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనపై దృష్టి పెట్టకుండా మంత్రులు ఎమ్మెల్యేలు ఒక భజన బృందం గా తయారై బూతులు మాట్లాడటాని తీవ్రంగా ఖండించారు. భద్రత భరోసా కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ పదే పదే విఫలమవుతోంది. తిరుపతి ఎమ్మార్ పల్లి ఎస్సై ఫిర్యాదు కోసం వచ్చిన మహిళను బెల్ట్ తో కొట్టడం దారుణమన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్ కు రావడం ఫిర్యాదు చేయడం అరుదు. ఎమ్మార్ పల్లి ఎస్సై ని తక్షణమే సస్పెండ్ చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అసెంబ్లీ లో దిశ చట్టం చేసి సంవత్సరం గడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అనుమతించలేదు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మూడొందల మంది అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగాయి. వైసిపిపార్టీ పదేపదే దళితులను అవమానిస్తున్నది. స్వర్గీయ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు తిరుపతిఎంపీ సీటు కు బదులుగా ఎమ్మెల్సీ ఇస్తామంటున్నారు.అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి లేకుండా 151 అసెంబ్లీ లో బూతులు మాట్లాడే బృందంగా తయారై జగన్ భజన మాత్రమే చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
50 Total Views, 2 Views Today