AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాడే మోసిన..ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి…

1 min read

AAB NEWS : వైఎస్సార్ పార్టీ కార్యకర్త..వాసుదేవ రెడ్డి పాడే మోసిన..ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన వాసుదేవరెడ్డి తిరుపతి, మంచికి మారు పేరుగా నిలిచి, పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే నాయకుడు పెరుమాళ్ల పల్లి మాజీ సర్పంచ్ వాసుదేవ రెడ్డి అని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెరుమాళ్ళ పల్లి లోని అయన నివాసం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి  వాసుదేవరెడ్డి పార్థివదేహానికి గజమాల వేసిన ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతిని ప్రార్థించారు. వాసుదేవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం వాసుదేవ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న చెవిరెడ్డి పార్థివ దేహాన్ని(పాడే) మోశారు. స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి దగ్గరుండి పర్యేక్షించి అంతిమ వీడ్కోలు పలికారు. పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించే ఆయన మరణం పార్టీకి తీరని లోటు మిగిల్సిందన్నారు. అంతకుముందు చెవిరెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి, తనయులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి లు వాసుదేవరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 218 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.