September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైఎస్ఆర్సిపి తిరుపతి ఎంపీ అభ్యర్థి డా. ఎం గురుమూర్తి గారు, గత ఎనిమిది నెలలుగా వికలగులు, హిజ్రా మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖా, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక అధికారిగా కార్యకలాపాలు నిర్ర్వహిస్తున్నారు…

1 min read

AABNEWS : వైఎస్ఆర్సిపి తిరుపతి ఎంపీ అభ్యర్థి.డా. ఎం గురుమూర్తి గారు, గత ఎనిమిది నెలలుగా వికలగులు, హిజ్రా మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖా, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక అధికారిగా కార్యకలాపాలు నిర్ర్వహిస్తున్నారు. ఒక డాక్టర్ (ఫీజియోథెరపిస్ట్) నేపధ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వికలాంగులకు వైద్య పరంగా ఎలాంటి అవసరాలు ఉంటాయనే కాకుండా, సమాజంలో వారు ఎదుర్కుంటున్న సమస్యలు, కుటుంబ పోషణకు వికలగులు, హిజ్రా మరియు వయో వృద్ధులకు ప్రభుత్వం పధకాలు మరింత చేరువ చేసేల కృషి చేసారు. అలాగే ప్రభత్వం ఇంకా ఏవిధంగా వారికీ అందించే సేవలు మేరుపచే అవకాశాలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చాలా సందర్భాలలో ఈ డిపార్ట్మెంట్ నేను కావాలని పట్టుబట్టి తీసుకున్నాను. సమాజంలో సేవ చేయటానికి ముందుగా అర్హులందరు ఈ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలను ఇక్కడి నుంచే ప్రారంభించాలని నా అభిలాష అని చెప్పటం జరిగింది. అలాగే రాజీనామా చేసే చివరి క్షణం వరకు ఆ ఆశయకోసం కృషి చేసారు కూడా.
వృత్తిరీత్యా డాక్టర్ అయినందువలన అవకాశం వచ్చినా ప్రతిసారి తన వృత్తిని సమాజం కోసం ఉపయోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అయన వెంట ఎప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది అంతే కాకుండా చిన్న పాటి సర్జరీ చేయటానికి అవసరమైన సామాగ్రి కూడా ఎల్లప్పుడు వెంట తీసుకువెళ్తుంటారు, మార్గ మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి చికిత్స చేస్తారు. అదే పెద్ద ప్రమాదం అయితే సమీప హాస్పిటల్ లో చేర్పించిన రోజులు ఉన్నాయి. అవసరం ఉన్న వ్యక్తికి తన పరిధిని మించి సహాయం చేయటంలో ముందు ఉంటారు.
వ్యక్తిగతంగా కూడా చిన్నతనం నుంచి మంచి వ్యక్తిత్వం అలవర్చుకున్నారు, స్విమ్స్ హాస్పిటల్ లో వారికీ పాఠాలు చెప్పిన డాక్టర్స్ కూడా గురుమూర్తి గురించి చెప్పే తీరు ఆశ్చర్య పరుస్తుంది. గురుమూర్తి మాట్లాడే తీరు ఎలా ఉంటుందంటే నిరుత్సాహంగా ఉన్న వ్యక్తి కూడా ఒకసారి డా. గురుమూర్తి గారిని కలిస్తే ఎంతో ధైర్యంతో తిరిగి వస్తారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు సరిచూసినందు వలన సమాజంలో ఎవరు అటువంటి కష్టాలు పడకూడదని తపించే వ్యక్తిత్వం.
ఈ రోజు డా. ఎం గురుమూర్తి గారిని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికలలో ప్రజలకోసం తీసుకురావటం శుభసూచికం.

 675 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.