AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శ్రీవారికి బంగారు శంఖు,చక్రాలు కానుక ఆలయంలో నేడు ఇవ్వనున్న భక్తులు

1 min read

AABNEWS : అలంకారప్రియుడైన తిరుమలేశుడికి మరో అపూర్వమైన స్వర్ణా భరణాలను భక్తుడు కానుకగా సమర్పించారు. తమిళనాడు, తేనికి చెందిన తంగదురై అనే భక్తుడు సుమారు రెండు కోట్ల రూపాయిలతో బంగారు శంఖు, చక్రాలు ప్రత్యేకంగా తయారు చేయించాడు. భక్తుడు సమర్పించబోయే ఈ స్వర్ణ శంఖు, చక్రాలు సుమారు 3 కిలోల బంగారంతో దాత ప్రత్యేక స్వర్ణ కారులతో చేయించారు. ఈ స్వర్ణ కానుకను నేడు ఉదయం శ్రీవారి ఆలయంలో దాత టీటీడీ అధికారులకు అందజేయనున్నారు, స్వామివారి మూలవిరాట్టుకు బంగారు శంఖు, చక్రాలను అర్చకులు అలంకరిస్తారు..
శ్రీవారిపై అపారభక్తి గల ఈ దాత టీటీడీ అధికారుల సూచన మేరకు గతంలో కూడా కోట్లాది రూపాయలు విలువచేసే స్వర్ణాభరణాలను కానుకగా సమర్పించారు. స్వామి పై అపారమైన భక్తితో సంపదన మొత్తం శ్రీవారి విరాళంగా అందిస్తానని భక్తుడు అంటున్నారు..

 111 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.