తుఫాన్ వలన పంట నష్ట పోయిన రైతులను జూమ్ యాప్ ద్వారా
1 min read
AAB NEWS : కృష్ణా జిల్లా తుఫాన్ వలన పంట నష్ట పోయిన రైతులను జూమ్ యాప్ ద్వారా గౌ, చంద్రబాబు గారితో మాట్లాడించిన ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కృష్ణా జిల్లా, ఉయ్యురు మండలం, కడవకొల్లు గ్రామంలో తుఫాన్ వలన అకాల వర్షాలతో వరి పంట నష్టపోయిన రైతులను పరామర్శించి నీట మునిగిన వరి పొలాల్ని సందర్శించిన రాజేంద్ర ప్రసాద్ . ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ పొలం దున్ని, వరి నాటి, కోతకోసి ఎండనక,వాననకా 4 నెలలు పాటు రైతు కష్టపడి పండించిన పంట నోటి దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా ప్రకృతి వైపరీత్యం వలన నీటి పాలు అవ్వడం చాలా బాధాకరం అని, రైతుకి పంట కోతవరకు రావడానికి ఎకరానికి సుమారు 25,000 వేలు ఖర్చు అయ్యిందని, ఈ రైతులందరూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన కౌలు చేసేవారని, ఇప్పుడు ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత వరకు ఈ రైతులను ఆదుకుంటారో చూద్దామని, వెంటనే పొలాలు పంట పండించే రైతులకు ఎకరానికి రూ,, 25,000 వేలు నష్ట పరిహారం చెల్లించి, ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేకపోతే రాష్ట్రంలో పంట నష్ట పోయిన రైతులందరిని కలుపుకొని మా తెలుగుదేశం పార్టీ నాయకులం రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే పొలాల్ని సందర్శించేటప్పుడు జూమ్ యాప్ ద్వారా జరుగుతున్న టీడీఎల్పీ మీటింగ్ లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ గారు పంట నష్ట పోయిన కడవకొల్లు రైతులను చంద్రబాబు గారితో ఫోన్లో ముఖాముఖీ మాట్లాడించి, నీటమునిగిన పంటపొలాల్ని చంద్రబాబు గార్కి చూపించారు. ఈ కార్యక్రమం లో తెదేపా ఉయ్యురు మండల అధ్యక్షులు వేమూరి శ్రీను గారు, తెదేపా సీనియర్ నాయకులు అంజిబాబు గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, సోమేశ్వరావు మరియు పెద్ద ఎత్తున రైతులు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

30 Total Views, 2 Views Today