తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి…
1 min read
AABNEWS : మండల పరిధిలోని గుండుమల పంచాయతీకి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాజీ సర్పంచ్ గుండుమల చంద్రప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.10 వార్డులకు గాను 10 మంది వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మడకశిర నియోజకవర్గ అభివృద్ధి తో పాటు గుండుమల గ్రామంలో కూడా మా కుటుంబ చరిత్ర ఎనలేనిదని ఈసారి తమకు పట్టం కడితే గ్రామ చరిత్రను మరోసారి తిరగ రాస్తామని తేదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు . ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. ఆదివారం సొంత గ్రామం అయినటువంటి గుండుమల లో తేదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పర్యటించారు. అనంతరం తేదేపా అభ్యర్థి సర్పంచ్ గా మాజీ గుండుమల చంద్రప్ప ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.10వ వార్డు మెంబర్లకు కూడా ఎన్నుకోవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ : -గతంలో కూడా సర్పంచ్ అభ్యర్థి చంద్రప్ప అయ్యారని గుండుమల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించమన్నారు. గ్రామంలో ప్రజలకు కావలసిన అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఘనత మాదే అన్నారు.25 సంవత్సరాల గ్రామ అభివృద్ధిలో చరిత్ర తమ కుటుంబానిదే నిలిచిందని వివరించారు.
మరింత గ్రామం అభివృద్ధి పథంలో నడవాలి అంటే తమ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థి చంద్రప్ప కు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు .
తెదేపా అభ్యర్థి సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు పట్టం కడితే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని తేదేపా సర్పంచ్ అభ్యర్థి చంద్రప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండుమల గ్రామ పెద్దలు ప్రజలు నాయకులు. మహిళలు. యువత . కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

588 Total Views, 2 Views Today