తెలుగు రాష్ట్రాలలో అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని…
1 min read
AABNEWS : అక్రమ అరెస్టులు ఆపాలి సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ..తెలుగు రాష్ట్రాలలో అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఉపా చట్టాన్ని రద్దు చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సూర్యాపేట లో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి యం .డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)రెండు తెలుగు రాష్ట్రాలలో మేధావులు, కవులు ,కళాకారులు, ఇళ్లపై సోదాలు జరిపి ఉపా క్రింద కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేయడాన్ని న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు . 2 తెలుగు రాష్ట్రాల లోని 14 జిల్లాలలో 36 చోట్ల 64 మంది పై అక్రమ కేసులు నమోదు చేసి వారిని అర్బన్ నక్సలైట్లు గా సృష్టించే దుర్మార్గమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రశ్నించే గొంతు ను నొక్కి వేయడం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలు ఆపాలి అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అనచాలనుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో గుర్తు చేసుకోవాలన్నారు .ప్రజా పోరాటాలు సజీవంగా ఉంటాయి అన్నారు ఈ కార్యక్రమంలో లో సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య ,AIKMS జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ ,PYLజిల్లా కార్యదర్శి కునుకుంట్ల సైదులు,IFTU జిల్లా ఉపాధ్యక్షులు కరింగుల వెంకన్న,BOC జిల్లా కార్యదర్శి దేశోజు మధు,టౌన్ నాయకులు SK సయ్యద్,దండి ప్రవీణ్,బండి రవి,మందడి శ్రీధర్,మందడి శేషిన్ కుమార్ ,వీరబోయిన రమేష్,బోల్క పవన్,రవి తదితరులు పాల్గొన్నారు
273 Total Views, 2 Views Today