దాడులను ఆపాలనే ఆలోచన ప్రభుత్వానికిలేదు…
1 min read
AABNEWS : ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి చిన్నా,పెద్ద సంఘటనలు125 జరిగాయి.ఇప్పటికి జరిగిన అన్ని సంఘటనలు హిందు దేవాలయాల మీద జరిగినవి తప్ప ఇంక ఏ మత ప్రార్ధనా మందిరాల మీద జరుగలేదు. జరగాలని ఏ భారతీయుడు కోరుకొడు అంతర్వేది రధం సంఘటనను సీబీఐ కి పంపించి చేతులు దులుపుకొన్నారు .కర్నూలులొ విగ్రహాన్ని ధ్వసం చేస్తే ,ప్రజలసహకరం తొ పట్టుకొని దొంగతనానికి వచ్చాడు హుండీలో డబ్బులులేవని దొంగకు కోపంవచ్చి విగ్రహాన్ని ధ్వసంచేసాడని పోలీసులు నిర్ణయించి దొంగతనం కేసును పెట్టారు .ఇంతపెద్దఎత్తున హిందూదేవలయాలమీద దాడులు,విద్వాంసాలు,అరాచకాలు జరుగుతుంటే ఈప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగాకూడలేక పోవడం,తాపీగాఉండడంచూస్తుంటే కచ్చితంగా ప్రభుత్వపెద్దల అండ ఎక్కడికి అక్కడ ఉందని అనిపిస్తుంది.
ప్రభుత్వం నిజంగా ఈ చర్యలను అరికట్టి ఇంక జరుగకూడదు అని అనుకుంటే 18 నెలలనుండి జరుగుతుంటే 1,2 జరిగినపుడే పోలీసును అలెర్ట్ చేసి ప్రతి దేవాలయంలో సిసి కెమెరాలు పెడితే దొరకరా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా శక్తి మంతులని పేరుంది రాజకీయాలు లేకుండా పోలీసులకు పవర్ (అధికారం)ఇవ్వండి జరిగినఅన్ని సంఘటనలలో కుట్రను బయటపెట్టి నిజమైన విద్రోహశక్తులను పట్టుకొంటారు. ఇదంతా హిందువులు సాధు స్వభావులుగా ఉంటే జరుగదు ప్రభుత్వానికి ఓట్లరూపంలో బుద్దిచెబితేనే జరుగుతుంది.
ఆ అవకాశం తిరుపతి ఎన్నికల రూపంలో ఏడుకొండల స్వామి మనకు ఇచ్చారు హిందువులమైన మనమందరం ఎవరికి ఏవిధంగా అవకాశం ఉంటే ఆ విధంగా ఎన్నికలలో పనిచేసి బిజెపి,జనసేన అభ్యర్థిని గెలిపించి హిందూదేవలయాలమీద దాడులను ఆపుదాం
85 Total Views, 6 Views Today