AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దిక్కుతోచని స్థితిలో అక్కాచెల్లెళ్ళు సహాయం కోసం ఎదురుచూపులు…

1 min read

AAB NEWS : శ్వాసకోస వ్యాధితో తల్లిదండ్రులు మృతి.వారం రోజుల వ్యవధిలో వరుస తల్లి తండ్రుల మరణాలు.సహాయం కోసం ఎదురుచూపులు.ఆ కుటుంబాన్ని విది పగబట్టింది, ఆడుతూ పాడుతూ గడుపుతున్న ఆ అక్కాచెల్లెళ్లకు వారం రోజుల వ్యవధిలో తల్లిదండ్రులును విది దూరం చేసి ఇంగ్లీష్ పిల్లలు రౌతు జ్యోతి, కిరణ్మయిలను అనాధలను చేసింది. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్న ఆడబిడ్డలను చూసి ప్రతి ఒక్కరకి కంట నీరు రాక ఆగదు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామానికి చెందిన రౌతు జ్యోతి,కిరణ్మయిలు ఆపన్నహస్తం అందించే దాతల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

వివరాల్లోకి వెళితే…

వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామానికి చెందిన రౌతు లక్షుంనాయుడు, లక్ష్మీ దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగించి ఇద్దరు ఆడ పిల్లలను చదివించే వాళ్ళు. పెద్ద అమ్మాయి జ్యోతి వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్, చిన్నమ్మాయి తమ గ్రామంలోనే జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. సాఫీగా జీవనం సాగుతున్న ఈ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఏప్రిల్ 12వ తేదీన తండ్రి లక్షుంనాయుడు, అదే నెల 19వ తేదీన తల్లి లక్ష్మీ శ్వాసకోస వ్యాధితో మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మరణించడంతో ఆ ఇద్దరు అమ్మాయిలు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు.

సాయం కోసం ఎదురుచూపులు….

గ్రామంలో చిన్న రేకుల షెడ్ లో నివాసముంటున్న వీరికి సెంటు భూమి గాని, చిల్లిగవ్వ ఆస్తిగానే లేదు. తల్లిదండ్రులు మృతితో జీవనోపాధి కూడా కరువైపోయింది. పూట గడవని స్థితిలో ఇద్దరమ్మాయిలు మానవతావాదుల కోసం బేల చూపులు చూస్తున్నారు. ఇరుగు పొరుగు వారు అందించే భోజనమే వాళ్లకు ఆధారం. కావున మానవతా వాదులు స్పందించి తమను ఆదుకోవాలని అక్కా చెల్లెళ్ళు జ్యోతి, కిరణ్మయి ప్రాధేయ పడుతున్నారు. సహాయం చేయదలచిన వారు 7601047688, 8187066275, 9030240466 గ్రామ సచివాలయం వారికి సంప్రదించాలని కోరుకుంటున్నారు.

 309 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.