AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దివీస్ వ్యతిరేక పోరాట ఉద్యమ నాయకులను బేషరతుగా విడుదలచేయాలి…

1 min read

AABNEWS : పిఠాపురం రిపోర్టర్ : కాలుష్య కారక దివీస్ పరిశ్రమను తరలించాలని, దివీస్ వ్యతిరేక ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, బేషరతుగా విడుదల చేయాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 12వరోజుకు చేరుకున్నాయి. ఈరోజు శిబిరాన్ని APMSRU రాష్ట్ర కార్యదర్శి చివుకుల వెంకటరావు ప్రారంభించారు. శిబిరానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమళ్ల మధుగారు, ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఇళ్ల వెంకటేశ్వరరావు, సీపీఎం రాజమండ్రి జిల్లా కమిటి కార్యదర్శి టి.అరుణ్, సీఐటీయూ రాజమండ్రి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.మూర్తి, సీపీఐ ఎం.ఎల్ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేశ్వరరావు, సీపీఐ న్యూ డేమోక్రసి జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఆర్.పి.ఐ నాయకులు అయితాబత్తుల రమేశ్వరరావుగారు, మద్యపాన వ్యతిరేక కమిటీ నాయకులు హసన్ మాట్లాడుతూ వైస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలుష్య కారక దివీస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలిపేస్తానని, విస్తారమైన తొండంగి మండల తీరప్రాంతాన్ని ఆక్వా హబ్ గా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడు అధికారంలోకి రాగానే మాట తప్పి, మడమ తిప్పి దివీస్ పరిశ్రమను ఎవరి ఒత్తిడికి లొంగి ప్రారంభోత్సవానికి సిద్ధపడ్డారని ప్రశ్నించారు.కేంద్రంలో బీజేపీ దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ, జిల్లాలో బీజేపీ నాయకులు దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. కేంద్రంతో దివీస్ అనుమతులు రద్దుచేస్తున్నట్లు ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం హయాంలో ప్రారంభమయిన పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించిన జగన్ ఇచ్చిన హామీలతో ప్రజలు నమ్మకంతో వేసిన ఓటు విలువను కాపాడటం కోసం 20వేల మంది ఉపాధిని పోగొట్టే దివీస్ పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సందర్బంగా ఇచ్చిన హామీని అమలుచేయాలని శాంతియుతంగా పోరాడుతున్న దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులపై, ప్రజలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, 31 రోజులనుండి జైళ్లలో ఉన్న 36మందిని బేషరతుగా విడుదల చేసేవరకు ఈ నిరాహారదీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ రోజు రిలే నిరాహారదీక్షలలో సీఐటీయూ కార్యదర్శి నూకలు బలరాం, చంద్రమళ్ళ పద్మ, కోశాధికారి మాలకా రమణ, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు, ఎం.రమేష్, సీపీఎం నగర కమిటీ సభ్యుడు జుత్తుగ శ్రీనివాస్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు, సీపీఐ.ఎం.ఎల్. లిబరేషన్ నాయకులు గొడుగు సత్యన్నారాయణ, సీఐటీయూ పెద్దాపురం నాయకులు దారపురెడ్డి క్రాంతి, ఐద్వా పెద్దాపురం నాయకురాలు కునిరెడ్డి అరుణ, ఆర్.టి.ఐ యాక్టివిస్ట్ తటవర్తి సుబ్బారావు, జిజిహెచ్ నాయకులు gvv సత్యన్నారాయణలు కూర్చున్నారు. ఈ దీక్షలకు వామిశెట్టి స్వామి, టివి.సత్యన్నారాయణ, జి.లోవరత్నం, రొంగల ఈశ్వరరావు మద్దతు తెలిపారు.

 1,071 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.