AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్…

1 min read

AABNEWS ; కరోనాతో లక్షలాది మంది మరణిస్తున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం లేదు.ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయడం లేదు.
గద్దెనెక్కి పాలన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా గాల్లో కలిసిపోతున్నా,వైద్య సౌకర్యాలు అరకొరగా ఉన్నా ఏమాత్రం స్పందించడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.ఎన్నికల జాతా మత్తులో మునిగి తేలుతున్నారు.అధికార దాహం తో గంగిరెద్దుల గంతులేస్తున్నారు.భౌతిక దూరానికి కొత్త అర్థాలు చెపుతున్నారు.ర్యాలీలు, బహిరంగ సభలు,కుంభమేళాలు హద్దు అదుపు లేకుండా ఇష్టమొచ్చినట్లు జరుపుతున్నారు.పేదవాళ్ళ ప్రాణాలను గడ్డిపోచతో సమానంగా చూస్తున్నారు. కరోన సెకండ్ వేవ్ తప్పకుండా వస్తుందని ప్రపంచంలోని ఆరోగ్య నిపుణులు గత సంవత్సరం నుండే ఎంత అరిచి గీ పెట్టినా పాలకులు పట్టించుకోలేదనడానికి నిదర్శనం లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే. దాహమేసిప్పుడు బావి తవ్వుకున్న చందంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని విధానం కొనసాగుతున్నది.హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించక పోవడం వల్ల యుద్ధప్రాతిపదికన ముందు చూపుతో వైద్య సౌకర్యాలు, వైద్యశాలలు వైద్య నిపుణులను ఏర్పాటు చేసుకోక పోవడం వల్ల సామాన్య ప్రజల దగ్గరి నుండి దేశానికి ఉపయోగపడే ఎంతో మంది మేధావులను,యువకులను, విద్యార్థులను,మహిళలను కోల్పోవడం జరిగింది.ఆక్సిజన్, బెడ్స్,మందులు లేక సరైన టైంలో వైద్యమందక ఎంతో మంది ఆప్తులను కోల్పోతూ ఈదేశం ఆర్తనాదాలు చేస్తుంది.ఆసుపత్రికి పోయిన రోగులు బ్రతికి ఇంటికి తిరిగి వస్తారని నమ్మకంలేక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ ఐనవారు ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. అప్పుసప్పు చేసి ఇల్లువాకిలి అమ్మి లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి అప్పులపాలైన భర్తకు తెలియకుండా భార్య,భార్యకు తెలియకుండా భర్త,అన్నకు తెలియకుండా తమ్ముడు,తమ్ముడికి తెలియకుండా అన్న శవాలుగా మారి పోతున్నారు.హృదయ విధారకమైన ఇలాంటి దృశ్యాలు ప్రతినిత్యం కళ్ళముందు దర్శనమిస్తున్నాయి.శవాలను కాల్చడానికి, పూడ్చడానికి కూడా సరైన స్థలాలు లేక క్యూ లో పెట్టి బంధువులు ఎదురుచూస్తూ పడి గాపులు కాస్తున్నారు.కాటి సుంకం శవాన్ని కాల్చటానికి 20 నుండి 25 వేలు వసూలు చేసే దౌర్భాగ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలస్వంతం.నమో మోడీ అంటే 303 సీట్లతో పార్లమెంట్ లో పూర్తి మెజారిటీ ఇచ్చామని,కరోనా పోతుంది చప్పట్లు కొట్టమంటే కొట్టామని భారత ప్రజల ను తక్కువగా చూస్తూనే ఈదేశానికి వాడాల్సిన వాక్సిన్లు ప్రక్క దేశాలలో పంచిపెట్టిన పాలన చేతకాని ప్రధాన మంత్రి మోడీని,151 సీట్లు అసెంబ్లీలో,22 సీట్లు పార్లమెంట్ లో ఇస్తే కనీసం కరోనా పరీక్షలు చేయడం, వాక్సిన్లు అందుబాటులో కి తేవడానికి బడ్జెట్ కేటాయింపులు చేయలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి ఎందుకు పంపించకూడదో ఒక్కసారి ఆలోచించండి.ఈవిధంగా ప్రజల చావులకు కారణమౌతున్న,ఈ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఆలోచించ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము

 323 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.