September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నవరత్నాలు పేదలు అందరికీ ఇల్లు…

1 min read

AABNEWS : గౌరవ ఎమ్మెల్యే శ్రీ కంబాల జోగులు గారి చేతుల మీదుగా అర్హులైన అక్క,చెల్లమలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం మొదలైంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం,రేగిడి ఆమదాలవలస, ఉంగరాడమెట్ట గ్రామంలో పట్టాలు పంపిణీ మరియు ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా చేశారు.కొన్ని నెలలుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రతి పేదవాని జీవిత కల నెరవేరే చారిత్రాత్మక ఘట్టానికి ఈరోజు సాక్ష్యంగా నిలుస్తోంది. రేగిడి ఆమదాలవలస మండలం, ఉంగరాడమెట్ట గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కంబాల జోగులు గారు,శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పాలవలస విక్రాంత్, పాలకొండ సబ్ డివిజన్ ఆర్. డి. ఓ TVSG కుమార్ చేతులు మీదుగా జగనన్న లేఅవుట్ ఘనంగా ప్రారంభం మరియు ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ, లబ్ధి దారులకు ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్, రెవెన్యూ అధికారుల, నాలుగు మండలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. శాసనసభ్యులు మాట్లాడుతూ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్లు లేని, అర్హులైన వారందరికీ పట్టాలు మంజూరయ్యాయని, రాష్ట్రంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పరాదర్శక పరిపాలన చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, మన కళ్ల ముందరే కనిపిస్తున్నాయని అన్నారు, ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు. అర్హులైన అక్క,చెల్లమలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం వైకుంఠ ఏకాదశి, క్రిస్ట్మస్ పర్వదినాన పేదల సొంతఇంటి కల సాకారం కావడం చెప్పలేనంత ఆనందంగా ఉందనీ ఎమ్మెల్యే కంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు,మండల కన్వీనర్లు మరియు ముఖ్య నేతలు, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ యువనాయుకుడు సందీప్ కంబాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు, మహిళలు, పాత్రికేయులు, సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 323 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.