February 24, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నామినేషన్స్ విత్డ్రా చివరిరోజు మరియు గుర్తుల కేటాయింపు…

1 min read

AABNEWS : పెద్దవడుగురు mpdo ఆఫీస్ నందు నామినేషన్స్ withdraw చివరిరోజు మరియు గుర్తుల కేటాయింపు సందర్భంగా మండలంలోని అన్ని పంచాయితీల నుండి సర్పంచు అభ్యర్థులు మరియు వార్డు సభ్యులు దాదాపు 300 మంది హాజరు కాగా… వాళ్లందరికీ mpdo గారు మరియు నేను సమావేశం నిర్వహించి .వారికి కొన్ని సూచనలు చెయ్యడం జరిగింది…పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం నిర్వహించేటపుడు రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు చేసుకోకూడదని… పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఉండే ఇండ్లలో ఆ ఇంట్లో వాళ్ళు తప్పా కొత్త వ్యక్తులు ఉండకూడదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి అని, ప్రచారం కొరకు మైక్ పెర్మిషన్ తీసుకోవాలి అని, పోలింగ్ రోజున పొలింగ్ స్టేషన్ చుట్టుపక్కల ఎటువంటి ప్రచారం చేయరాదు.. ఏజంట్లు పదే పదే బయటికి వెళ్లకూడదని, ఒక్కసారే releive కావలెను అని, ఏజంట్లు గా కూర్చునేందుకు రౌడీ షీటర్స్, kds,dcs మరియు suspect sheeters కి అనుమతి ఇవ్వబడదు అని, మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేయకూడదు అని ఎలాంటి చిన్న గొడవ, హింస, వదంతులను ప్రచారం చేయకుండా చూడాలి అని, సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి రెచ్చగొట్టే పోస్టులు పోస్టు చేయకూడదు అని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులెదురైనా తక్షణమే పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలి అని, గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని,టపాసులు కాల్చకూడదని..నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎంతటి వారైనా ఎటువంటి చిన్న సమస్య సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము అని,రౌడి షీట్స్ ఓపెన్ చేస్తామని పెద్దవడుగురు మండలంలో స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మేము అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు,ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా దానికి సహకరించాలని కోరడం జరిగింది.

 124 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.