September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన క్రీడల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి…

1 min read

AABNEWS : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన క్రీడల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి. సమాజంలో పలు విశిష్ట సేవలందించిన మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి. స్క్రోలింగ్ పాయింట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గం మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సమాజంలో కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్లు మహిళా చైతన్యాన్ని నిరోధించ లేవని మహిళలు నిరూపించాలి. సాధించాలనే తపన, లక్ష్యం చేరాలనే ఆశయం మహిళలను ఆకాశమంత ఎత్తుకు చేరుస్తాయి. మహిళలు వేసే ప్రతి అడుగు సమాజంలో మార్పులకు శ్రీకారం కావాలి. సమాన హక్కులు, స్వేచ్ఛ అందించగలిగితే మహిళలు పురుషుల కన్న మిన్నగా అన్ని రంగాలలో రాణిస్తారు. మహిళల ఆత్మ గౌరవం కోసం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి. గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా ప్రతిభావంతంగా పని చేస్తున్న మహిళకు తగిన గుర్తింపు రావడం లేదు. మహిళలు ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా, భర్తల ఆధ్వర్యంలో పని చేయకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ విధులు నిర్వహించాలి. మహిళలకు కొన్ని సమస్యలు ఉన్నా, కొంతమేర ఇబ్బందులు ఉన్నా, లెక్కచేయక కొందరు విజయం వైపు దూసుకెళ్తూ, దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు. భారతదేశంలో మహిళలు ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతిగా రాణించినా అనుకున్న స్థాయిలో మహిళా సాధికారతను సాధించలేక పోతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు ఒక్కరే మహిళలకు అండగా నిలిచి అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహిళల పేరున అమలు చేస్తున్నారు. మహిళలు ప్రజాప్రతినిధులుగానే కాకుండా అన్ని రంగాలలో రాణించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ, ఉపముఖ్యమంత్రి, హోంశాఖ స్థాయి పదవులను కట్టబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటి బిడ్డగా, తోబుట్టువుగా మహిళా సాధికారత కోసం మహిళల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తా.

 567 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.