September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఇళ్ల పట్టాల పంపిణి నిర్మాణానికి శ్రీకారం…

1 min read

AABNEWS : తేదీ 19.12.2020 శనివారం,ఉదయం 10.00 గంటలకు:: వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని పేదలందరికీ ఇల్లు అందించే మహత్తర కార్యక్రమం కోసం నిర్మిస్తున్న లే అవుట్ పనులను పరిశీలిస్తారు.అనంతరం ఉదయం 11.00 గంటలకు వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో వెంకటగిరి మున్సిపాలిటీ మరియు వెంకటగిరి రూరల్ మండల అధికారులతో క్రింది అజెండా అంశాలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
ప్రధానంగా నివార్ తుఫాన్ కు దెబ్బతిన్న ప్రాంతాల్లో మౌలికవసతుల పునరుద్ధరణ కోసం ఆర్ అండ్ బి ,పంచాయతీ రాజ్ ,ఇరిగేషన్ ,ఎలక్ట్రిసిటీ ,ఆర్ డబ్ల్యూ ఎస్, అగ్రికల్చర్ ,మున్సిపల్, రెవిన్యూ ,పోలీస్ అధికారులతో సమీక్ష. పేదలందరికీ వైయస్సార్ ఇల్లు పథకం ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో మొదటి విడతగా డిసెంబర్ 25 న మహిళామ తల్లుల పేరిట అందించడానికి కార్యచరణ గురించి. సచివాలయ సముదాయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ల భవన నిర్మాణాల పురోగతి గురించి. త్రాగునీటి సరఫరా మరియు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు గురించి. covid-19 నివారణ చర్యలు గురించి సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు డక్కిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద పైన పేర్కొన్న అజెండా అంశాలపై సంబంధిత అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సంబంధిత నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారులు వారి వారి శాఖ పరిధిలోని సమగ్ర వివరాలతో హాజరుకావాల్సిందిగా గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సూచించి యున్నారు
తదనుగుణంగా కోవిడ్ నిబంధనలను తు.చ.పాటిస్తూ,,తగు ఏర్పాట్లు కావించవలసినదిగా కోరడమయినది.

 118 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.