AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవిడ్ వ్యాక్సినేషన్ జిల్లా కలెక్టర్ తనిఖీ…

1 min read

AABNEWS : నెల్లూరు నగరంలోని డి.ఎం.&హెచ్.ఓ. కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు సందర్శించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తీసుకున్న చర్యలు గురించి… డి.ఎం.హెచ్.ఓ. ని అడిగి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డి.ఎం.హెచ్.ఓ. కార్యాలయంలోని కోవిడ్ వ్యాక్సిన్ నిల్వచేసే కోల్డ్ చైన్ రూమ్ ని పరిశీలించారు. వ్యాక్సిన్ ఎన్ని డోసులు నిల్వ చేయొచ్చు..? అవసరం అయితే నిల్వ సామర్ధ్యం పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాల ప్రకారం జిల్లాలో 16 లక్షల డోసులు కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ చేయడానికి సదుపాయాలు ఉన్నాయని, అదనపు కూలింగ్ మిషన్స్ ని ఉపయోగించి ఈ సామర్థ్యం పెంచవచ్చని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. మొదటి దశలో సుమారు 28,000 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి, రెండో దశలో సుమారు 50,000 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని, మొదటి దశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే సమయానికి జిల్లాలోని 30 లక్షల జనాభాకు వ్యాక్సినేషన్ ఇవ్వవడానికి సిద్ధం కావాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి సెషన్ సైట్స్ ని సిద్ధం చేయాలని, సెషన్ సైట్స్ లో విధులు నిర్వహించాల్సిన సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియపై త్వరితగతిన శిక్షణ ఇవ్వాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన అన్ని రకాల మందులు, వ్యాక్సినేషన్ వేసిన తర్వాత అస్వస్థత కలిగితే దానికి అందించాల్సిన మెడిసిన్స్, ఇంజక్షన్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ డా. ఎన్. హరేంధిర ప్రసాద్, ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, డి.ఎం.హెచ్.ఓ. శ్రీమతి రాజ్యాలక్షి, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

 120 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.