AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గోపాల్ రెడ్డి సేవ గుణం…

1 min read

AABNEWS : గుండవోలు గ్రామానికి చెందిన 16 మంది విద్యార్థులకు బస్సు పాసులకు నగదు చెల్లింపు బండి వేణుగోపాల్ రెడ్డి తరుపున ఆయన స్నేహితుడు పెంగాణి హరిప్రసాద్ రెడ్డి చేతుల మీదా విద్యార్థులకు పాసులు అందజేత బండి వేణుగోపాల్ రెడ్డి మరోసారి తన సేవ గుణాన్ని చాటుకున్నారు.మండలంలోని ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదవలన్న తన ఆశయంతో.అందులో భాగంగా మండలంలోని గుండవోలు గ్రామానికి చెందిన 16 మంది విద్యార్థులు గుండవోలు నుంచి రాపూరు కి వచ్చి విద్యాభ్యాసం చేసేందుకు వారికి బస్సు పాసులు కట్టుకునే స్తోమత లేకపోవడంతో విషయాన్ని గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు బొమ్మిరెడ్డి రవీంద్రారెడ్డి,నలవడ్ల పెంచల్ రెడ్డి, బండి వేణుగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెలడంతో ఆయన వ్యక్తిగత పనుల పై హైదరాబాద్ లో ఉన్నప్పటికీ విద్యార్థుల చదువులకు ఎక్కడ ఆటంకాలు ఉండకూడదన్న లక్ష్యంతో తన స్నేహితుడు పెంగాణి హరిప్రసాద్ రెడ్డి కి సమాచారాన్ని చేరవేసి 16 మంది విద్యార్థులకు చదువుకోవడం కోసం గుండవోలు నుంచి రాపూరు కు రాను..పోను బస్సు పాసులు అయ్యే 7000 నగదు చెల్లించి వారికి పాసులు ఏర్పాటు చేశారు.దింతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థులు ఒక్కసారిగా వారిలో అనందం వెల్లివిరిసింది, తమకు కష్టాల్లో ఆదుకున్న బండి వేణుగోపాల్ రెడ్డి గారికి జీవితాంతం ఋణపడి ఉంటామన్నారు.అనంతరం బండి వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ నుండి తన సందేశాన్ని పంపించారు.మండలంలోని ఏ ఒక్క పేద విద్యార్థి కూడా చదువుకు ఆర్థిక పరిస్థితులు ఆటంకం లేకుండా ఉండాలన్న ఉదేశంతో ఈరోజు ఈ పేద బిడ్డలకు బస్సు పాసులకు అయ్యే వ్యయం మొత్తం చెల్లించి వారికి పాసులు అందజేయడం జరిగిందన్నారు.మండలంలోని విద్యార్థులకు చదువుల కోసం ఎంతాయిన ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని.అయితే వారు కూడా శ్రద్దగా చదువుకొని వారి తల్లిదండ్రులకు, మండలానికి మంచి పెరుప్రఖ్యాతలు తెచ్చి పెట్టాలన్నారు.రాపూరు మండలంలోని ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదవలన్నదే తన కోరిక అన్నారు.పరీక్షలల్లో మంచి ప్రతిభ కనుబరచిన విద్యార్థులకు ప్రోత్సహక నగదు బహుమతులు అందజేస్తామన్నారు.ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ప్రతిభ కనుబరచాలని ఆయన కోరారు.

 162 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.