ఘనంగా ముక్కోటి ఏకాదశి…
1 min read
AABNEWS : ముక్కోటి ఏకాదశి పవిత్రతను పురస్కరించుకుని శుక్రవారం వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలో వెలసివున్న శ్రీశ్రీశ్రీ హనుమంత, లక్ష్మణ, సీతా సమేత శ్రీ పట్టాభిరామచంద్రస్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు… స్వామివార్లను ఉత్తరద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు… పూజలకు ఉభయకర్తలుగా బుర్లా మహేష్ రెడ్డి, భానుప్రియ దంపతులు వ్యవహరించారు. వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు
65 Total Views, 2 Views Today