September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తాటిపర్తి పంచాయతీ అభివృద్ధి కోసం 9 కోట్ల 45 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించిన ఎమ్మెల్యే కాకాణి…

1 min read

AAB NEWS : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, తాటిపర్తి గ్రామపంచాయతీ, నల్లబాలెం గ్రామానికి 2 కోట్ల 89 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంటు రోడ్డు నిర్మాణంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.తాటిపర్తి పంచాయతీ అభివృద్ధి కోసం 9 కోట్ల 45 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించిన ఎమ్మెల్యే కాకాణి.చిన్న గ్రామమైన నల్లబాలెం గ్రామానికి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్న ఎమ్మెల్యే కాకాణి. సర్వేపల్లి నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం.దశాబ్దాల కాలంగా నల్లబాలెం గ్రామ ప్రజలు తమ గ్రామానికి రోడ్డు కోసం కన్న కలలు నేడు నిజమయ్యాయి.సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కోట్లాది రూపాయలు వెచ్చించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలన్నింటికి పూర్తిస్థాయి సిమెంట్ రోడ్లతో పాటు, డ్రైన్లు, త్రాగునీరు, సాగునీరు అవసరాలతో పాటు, అవసరమైన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాంసర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక, తమ హయాంలో కనబడని అభివృద్ధి, నేడు పరుగులు తీస్తుండడంతో జీర్ణించుకోలేక విమర్శలకు పాల్పడుతున్నారు కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం విశేషం.సర్వేపల్లి నియోజకవర్గానికి శాసన సభ్యునిగా కాక “ఇంటి బిడ్డ” గా సేవలందిస్తా.

 1,723 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.