September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచార వ్యూహరచన సమావేశంలో…

1 min read

AABNEWS : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచార వ్యూహరచన సమావేశంలో… అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారితో పాల్గొన్న వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కౌన్సిలర్లు పార్లమెంటు ఉప ఎన్నికకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ.మద్దెల గురుమూర్తి గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ.ఆనం రామనారాయణ రెడ్డి గారి నివాసంలో అభ్యర్థి డాక్టర్ శ్రీ మద్దెల గురుమూర్తి తో పాటు ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సమావేశమై పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారానికి రూపకల్పన, వ్యూహ రచన చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ, శ్రీ దుర్గా ప్రసాద్ సారథ్యంలో… వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్ లు అందరూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ నక్కా భానుప్రియ, పార్లమెంట్ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, మరియు ఎమ్మెల్యే లకు పుష్పగుచ్ఛాలు అందించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

 1,991 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.