AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

“తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే “…

1 min read

AAB NEWS :

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలోని టి.పి.గూడూరు, ముత్తుకూరు వెంకటాచలం మండలాలలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలను పరామర్శించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

నివర్ తుఫాన్ తో జలమయమైన లోతట్టు ప్రాంతాలు, కాలనీలను సందర్శించి, యానాది కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.

సర్వేపల్లి నియోజకవర్గంలో వాగులు పొంగి పొర్లడంతో తిరుమలమ్మపాళెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకొని రాకపోకలు నిలిచిపోవడంతో, బోటులో వెళ్లి, గ్రామ ప్రజలను కలుసుకొని బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.

పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న కుటుంబాలను పరామర్శించి భోజనం, దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

తుఫాన్ ఉధృతికి ప్రమాదకర స్థాయికి చేరుకున్న చెరువులు, కాలువలు, వాగులతో పాటు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.

స్క్రోలింగ్ పాయింట్స్:

👉నివర్ తుఫాన్ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం.

👉 లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన, వసతి కల్పించడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

👉 వరి నాట్లు దెబ్బతినడం, నారుమడ్లు నీట మునగడంతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందిస్తాం.

👉 తుఫాన్ తో దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు చెందిన నష్టాన్ని అంచనా వేసి, రైతులకు పరిహారం అందిస్తాం.

👉 మగ్గం గుంటలలో నీళ్లు వచ్చి ఇబ్బందులు పడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకుంటాం.

👉 ధాన్యం అమ్మకాల ద్వారా రైతులకు రావలసిన డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు.

👉 మిగిలిన పోయిన వారందరికీ మరో రెండు, మూడు రోజుల్లో నిధులు జమ చేయడం జరుగుతుంది.

👉 వర్షం కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాలువలు, వాగులకు వెంటనే మరమ్మతులు చేపట్టి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

👉 గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్తును పునరుద్ధరిస్తున్నాం.

👉 నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

👉 తుఫాన్ నేపథ్యంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించి ప్రజలకు అండగా నిలిచిన అధికారులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 94 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.