AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తుఫాన్ బాధిత వృద్ధురాలిని ఆదుకున్నా శ్రీమతి మౌనిక రెడ్డి…

1 min read

AAB NEWS : వేంకటగిరి నివర్ తుఫాన్ బాధిత నిరుపేద వృద్ధురాలిని ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్న మౌనిక చారిటబుల్ పౌండేషన్ అధినేత్రి శ్రీమతి మౌనిక రెడ్డి అది వెంకటగిరి మండలంలోని అమ్మపాలెం అనే కుగ్రామం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు అయిన నగరం ఆదెమ్మ పూరి గుడిసె వాన నీటిలో మునిగిపోయింది. దిక్కు తోచక ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్న సమయంలో… హైదరాబాదులో ఉన్న మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత్రి, మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి మౌనిక రెడ్డి సోషల్ మీడియాలో ఆ వృద్ధురాలి గురించి తెలుసుకొని… వెంటనే మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ వాలంటీర్ హరి ద్వారా ఆ వృద్ధురాలికి కావలసిన ఒక రైస్ కట్ట తో పాటు నిత్యావసర వస్తువులు, రెండు చీరలు ఒక దుప్పటి వెనువెంటనే సమకూర్చింది. హైదరాబాద్ నుండి ఫోన్ ద్వారా వృద్ధురాలు నగరం ఆదెమ్మ తో మాట్లాడుతూ త్వరలో తాను అమ్మపాలెం లోని ఆ వృద్ధురాలి ఇంటికి వస్తానని ఆమెకు తదుపరి ఆర్థిక సహాయం కూడా చేస్తానని తెలియజేసింది. అనాధ వృద్ధురాలికి సరియైన సమయంలో సరి అయిన సహాయం అందించిన మౌనిక న చారిటబుల్ ఫౌండేషన్ అధినేత్రి శ్రీమతి మౌనిక రెడ్డి గారికి మనమంతా అభినందనలు తెలుపుదాం.

 124 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.