September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తోళ్ల పరిశ్రమ రద్దు చేయండి…

1 min read

AABNEWS : తోళ్ల పరిశ్రమ రద్దు చేయండి’ ఒకేమాట… ఓకే బాట..తోళ్ల పరిశ్రమ మాకు వద్దు తోళ్ల శుద్ధి కర్మాగారం తో గ్రామాలు నాశనం 10 ఏళ్ళు ఉద్యమాలు చేశాం.. ఇప్పుడు చేస్తాం వైసీపీ ప్రభుత్వంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు కాదు అని నమ్ముతున్నాం నాడు జగనన్న మాట ఇచ్చారు ప్రజల సంక్షేమం కోసం ఏ త్యాగాలకు అయినా సిద్ధం పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడి గత కాంగ్రెస్ ప్రభుత్వం లోమంజూరు చేసిన తోళ్ల పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిశ్రమ ఏర్పాటుకు తాము అనుకూలం అనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు, గురువారం కోట మండలం లోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న వావిళ్ళ దొరువు గ్రామ సమీపంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు స్థలం వద్ద పేర్నాటి ఆయన అనుచర వర్గం,ప్రజలు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా పేర్నాటి మాట్లాడుతూ తోళ్ల శుద్ధి పరిశ్రమ ఏర్పాటు అయితే
తోళ్లపరిశ్రమలనుంచివిడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలతో వాతావరణ, వాయుకాలుష్యంపెరుగుతోదని దీనికి తోడు భూ గర్భజలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయని అని తెలిపారు తోళ్ళ పరిశ్రమను పెడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదనీ, ప్రజలకుఆమోదయోగ్యమైన లెదర్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే మంచిది అని తెలిపారు ,తోళ్ళ పరిశ్రమ వద్దు అంటూ.. 10 ఏళ్లుగా పోరాటంచేస్తున్నామన్నారు. కోట మండలం, కొత్తపట్నం పంచాయతీ పరిధిలో కెపిఐఎల్ కృష్ణపట్నం పోర్ట్‌ ఇంటర్నేషనల్‌ లెదర్‌ కాంప్లెక్స్‌, ఇండిస్టీ ఏర్పాటు 2010 లో ఆనాటి కేంద్ర, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం లో మంజూరయ్యింది. అప్పటి నుండి తోళ్ళ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. ఈ ఉద్యమానికి తాను ప్రాతినిధ్యం వహిస్తూ.. ఉద్యమాన్ని ఉధృతం చేశాం అన్నారు, కాంగ్రెస్‌ ప్రభుత్వం లో అధికారులు శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ.. చివరకు ఫలితం లేకుండా పోయింది. 2014 లో టిడిపి అధికారంలోకి వచ్చినా పరిశ్రమ నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం వైసిపి అధికారంలోకి వచ్చే 18 నెలలు గడవకముందే తోళ్ళ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు అధికారులు అందువలన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లము అనీ ఆయన తప్పకుండా న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చారు అని తెలిపారు, తోళ్ల పరిశ్రమ ఏర్పాటు జరగదనీ, షూ తయారీ ఫ్యాక్టరీకి అయితే తాము మద్దతు ఇస్తామని తాము స్పష్టం అధికారులకు స్వష్టం గా తెలియజేస్తున్నాం అన్నారు ముందు పరిశ్రమ ఏర్పాటువల్ల లాభనష్టాలు తెలుసుకోవాలని, అవి ఏమి తెలుసుకోకుండా పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎవరూ అయినా మాట్లాడం సబబు కాదు అన్నారు. ఆనాడు ప్రతిపక్ష నేత గా ఉన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తోళ్లపరిశ్రమ ను రద్దు చేస్తాం ఆనాడు హామీ ఇచ్చారు అనీ ఇచ్చిన మాట తప్పని జగన్మోహన్ రెడ్డిని తాము ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నాం అనీ తెలిపారు, చివరిగా ఓకే మాట ఓకే బాట తోళ్ల శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు మేము పూర్తి వ్యతిరేకం అనీ అందుకోసం ఏ త్యాగాలకు అయినా సిద్ధం అనీ ఆయన స్వష్టం గా తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పేర్నాటి వర్గీయులు మాజీ జడ్పీటీసీ ఉప్పల ప్రసాద్‌ గౌడ్‌, పాదర్తి రాధ కృష్ణ రెడ్డి, దువ్వూరూ సాయి కృష్ణ రెడ్డి, వెంకు రెడ్డి , ఇన్న మాల వెంకటాద్రి, ఉప్పల ప్రభాకర్‌, వైసీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 324 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.