AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దస్తర్ బంది నిర్వహించి ,తమ సంపూర్ణ మద్దతు తెలిసిన అజ్రీర్ దర్గా మతపెద్దలు.

1 min read

AABNEWS : స్థానిక మన్సూర్ నగర్ లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్. సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ దేశవిద్రోహ శక్తులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ను అపకీర్తి పాలు చేయటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అందలో భాగంగా RSS ఎజెండా పై పని చేసె బిజెపి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవలసిన ఏజెన్సీ లలో ఒకటైన ED (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్సమెంట్) ను పాపులర్ ఫ్రంట్ పై ప్రయొగించింది. ఈ కుట్రలకు భారతదేశం లోని వివిధ లౌకిక పార్టీల నాయకులు ,వివిధ సంఘాలు మరియు భిన్న మతాల పెద్దలు తీవ్రంగా ఖండిస్తు “We Stand with Popular Front of India ” మేము పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తో ఉన్నాం అని తీవ్రంగా గలమెత్తారు .నేడు భారతదేశం లోనే అన్నిటికంటే గొప్ప దర్గా అయిన అజ్మీర్ దర్గా మతపెద్దలు కేవలం తమ మద్దతు తెలపటమే కాకుండా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి అనీస్ అహ్మద్ గారిని ,పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజస్తాన్ రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ మిర్జా గారిని, రాజస్తాన్ రాష్ట్ర SDPI ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ షఫీ గారిని మరియు SDPI జాతీయ కార్యదర్శి తస్లీమ్ రహ్మాని గారిని అజ్మీర్ దర్గా ప్రముఖ మతపెద్ద హజరత్ సయ్యద్ సర్వర్ చిష్టి మరియు సూఫీ నాయకులైన సయ్యద్ హబీబ్ హాష్మీ చిష్టి వారికి సాంప్రదాయ దస్తర్ బంది నిర్వహించి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు అజ్మీర్ దర్గా సహకారాం ఎల్లవేళలా ఉంటుందని మరియు మేము సైతం దేశ ప్రజాస్వామ్యాన్ని మరియు ప్రజల హక్కులను రక్షించటంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తామని తెలిపారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి షేక్ ఇమామ్ బాషా మాట్లాడుతూ దేశంలోని అన్ని దర్గాలకు పెద్దది మరియు భారతదేశంలో ని అన్ని దర్గాలు అజ్మీర్ షరీఫ్ దర్గా మతపెద్దల మాటకు కట్టుబడి ఉంటారని .నేడు అజ్రీర్ షరీఫ్ మతపెద్దలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు తమ మద్దతు తెలిపి ఖాజా గరీబున్ నవాజ్ చిష్టి రహమతుల్లాహ్ అలైహి గారి ఆశయాలను నెరవేరుస్తున్నారని తెలిపారు.

 197 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.