దేశం కోసం పాపులర్ ఫ్రంట్ తో” నినాదం తో పబ్లిక్ మీట్
1 min read
AABNEWS ; దేశం కోసం పాపులర్ ఫ్రంట్ తో” నినాదం తో పబ్లిక్ మీట్ ను నిర్వహించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నెల్లూరు,07/02/2021: స్థానిక శెట్టిగుంట రోడ్ దగ్గర కల బర్మషల్ గుంటా ,ఈద్గా మైదానంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా “దేశం కోసం పాపులర్ ఫ్రంట్ తో” నినాదం తో పబ్లిక్ మీట్ ను నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య స్పీకర్లు గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ సయ్యద్ అబ్దుల్ లతీఫ్ ఖాద్రీ గారు ,SDPI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ వారిస్ గారు ,సోషియో రీఫామ్స్ సొసైటీ అధ్యక్షులు డా,,అలీం ఖాన్ ఫల్కీ గారు మరియు ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ హనీఫ్ అహ్రార్ సాహెబ్ గారు విచ్చేశారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా “పబ్లిక్ మీట్”లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌ,, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారిని ,టి.డి.పి జిల్లా అధ్యక్షులు జనాబ్ హాజి అబ్దుల్ అజీజ్ గారిని మరియు ఇతర ఆతిధులను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ గారు హ్రుదయపూర్వకంగా స్వాగతించారు. ఈ పబ్లిక్ మీట్ లో విచ్చేసిన ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ హనీఫ్ అహ్రార్ సాహెబ్ మాట్లాడుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశప్రజల సాధికారత కోసం నిరంతరం క్రృషి చేస్తుందని దేశ సాధికారత జరగాలంటే కేవలం అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కు,సాధికారత కు ,దేశ రాజ్యంగానికి ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయటం ఎంతో అవసరమని .పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల సాధికారత కోసం విద్య పరంగా ,ఆరోగ్య పరంగా ,న్యాయ సహకారం మరియు విపత్తులలో సంపూర్ణ సహకారం తో పాటు మానవహక్కుల రక్షణ ,రాజ్యాంగ రక్షణ కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుంది .మన దేశానికి పట్టి పీడిస్తున్న చీడపురుగుల నుంచి సెక్యులర్ భారతదేశాన్ని కాపాడటం కోసం ధైర్యంగా ముందుకు సాగుతున్న జాతీయ సంస్థ అని దీనికి ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ ఎలప్పుడు తోడు ఉంటుందని ,దేశ ప్రజలందరూ ప్రస్తుత ఫ్యాసిస్ట్ పరిపాలన లో పీడించడ బడుతున్నారని .దేశంలో ఎవరు శుఖః సంతోషాలతో లేరని .దేశప్రజల శుఖః సంతోషాల కోసం పాపులర్ ఫ్రంట్ నిత్యం శ్రమిస్తుందని తెలిపారు.
SDPI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ వారిస్ గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో అందరూ భయభ్రాంతులై జీవిస్తున్న సమయంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా సేవచేసింది .ముఖ్యంగా కరోనా పాజిటివ్ మ్రతదేహాలను కులమతాలకు అతీతంగా మానవత్వం ను బ్రతికించటానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇన్ని సేవ కార్యక్రమాలు చేసే జాతీయ స్వచ్ఛంద సంస్థ ను అణగదొక్కాలని మతోన్మాదులు ఎన్నో కుట్రలు కుంతంత్రాలు చేసిన దైర్యంగా నిలబడి పోరాడే సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని తెలిపారు.
సోషియో రీఫామ్స్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అలీం ఖాన్ గారు మాట్లాడుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మానవహక్కుల రక్షణ కోసం పనిచేస్తు ,బాధితులకు న్యాయ సహాయం అందించటం , సెక్యులరిజం ను కాపాడటానికి నిరంతరం మైదానంలో ఉందని పాపులర్ ఫ్రంట్ బాధితులకు సహాయార్దం నిలబడి ఉందని ప్రస్తుతం రైతులకు వ్యతిరేక నల్లచట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని దేశ రైతులు చేస్తున్న నిరసనలకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విచ్చేసి జయప్రదం చేశారు.
480 Total Views, 2 Views Today