దేశరైతులకు పాపులర్ ఫ్రంట్ మద్దతు…
1 min read
AAB NEWS : నెల్లూరు: దేశరైతుల నిరసనలకు పాపులర్ ఫ్రంట్ మద్దతు తెల్పుతుంది ; రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటానికి పిలుపునిచ్చింది
నెల్లూరు స్థానిక మన్సూర్ నగర్ లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ కొత్తగా రైతులకు వ్యతిరేకంగా చేయబడ్డ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో మార్చ్ కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తమ సంపూర్ణ మద్దతు తెల్పుతుందని ఛైర్మన్ O.M.A.సలాం గారు తెలిపారన్నారు.
మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకమైన ,ప్రజలకు వ్యతిరేకమైన సామ్రాజ్యావాదులకు లబ్ధి పొందించే చట్టాలు చేసి భారతదేశ రైతుల జీవితాలను అంధకారంలో నెట్టివేస్తుంది.రైతుల బాధలు ప్రభుత్వం పెడచెవి పెట్టింది భవిష్యత్తు లో యవాత్ దేశ ప్రజల బాధలు కూడా ఈ ప్రభుత్వం పెడచెవి పెట్టబోతుంది.అందువల్ల ప్రతి భారతీయుడు ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా నిరసనలు తెల్పాలి.బిజెపి పరిపాలిత హర్యానా లో రైతుల మార్చ్ ను పోలీసులు దౌర్జన్యంగా ,హింసాత్మకంగా ప్రవర్తిస్తు రైతు నాయకులను అన్యాయంగా అరెస్టు చేయడం జరిగింది.రైతులకు పూర్తి మద్దతు తెలుపుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది.
ఒకపక్క దేశంలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటుంటే మరోపక్క దేశంలో అందరికీ ఆహారాన్ని పండించే రైతుల ప్రాధమిక హక్కులను కాలరాస్తు పోలీసులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.ఈ విధంగా రాజ్యాంగంపై రాజ్యాంగ దినోత్సవం రోజునే దాడి చెసి మతోన్మాదుల మనుస్మ్రుతి ని తీసుకొని వచ్చి భారతీయులను మరలా బానిసలుగా మార్చాలని కుట్రలు పన్నుతున్నారు వారికి తొత్తులుగా మారి పోలీసులు ఏ రాజ్యాంగ పై ప్రమాణం చేశారో అదే రాజ్యాంగాన్ని పట్టపగలు హత్య చేస్తున్నారు.నేడు అమాయకులు ,ఉద్యమకారులు ,విద్యావంతులు ,అన్యాయంగా నల్లచట్టాలు మోపబడి జైళ్లలో మగ్గుతున్నారు.
ఇలాంటి సమయంలో భారతీయలందరూ దేశం పై దేశ రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలని తెలిపారు.
26 Total Views, 2 Views Today