AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు…

1 min read

AABNEWS : నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంపై అధికారులు, నాయలకులతో కలిసి సమీక్షించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 25వ తేదీన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందివ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పేదవారి సొంతింటి కోసం 8000 కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వ భూములు ఉన్నచోట ప్రభుత్వ భూములను, లేని చోట పట్టా భూములను కొనుగోలు చేసి లేఅవుట్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేశాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో అధికారులు, నాయకులతో సమీక్ష నిర్వహించాం. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టా అందించే బాధ్యత నాది. అధికారులు, గ్రామ నాయకులు సమన్వయంతో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం అందేవిధంగా చొరవ తీసుకోవాలి. డిసెంబర్ 25వ తేదీ నుండి రెండు వారాల పాటు పట్టా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి, నియోజకవర్గంలో సంపూర్ణంగా పంపిణీ చేస్తాం.

 183 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.