నిలిచిపోయిన మంచినీటిని సరఫరా చేసే వాటర్ ప్లాంట్ ను సందర్శించి, అధికారులు…
1 min read
AABNEWS : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వంలో ప్రారంభించి, పూర్తి కాకుండా నిలిచిపోయిన మంచినీటిని సరఫరా చేసే వాటర్ ప్లాంట్ ను సందర్శించి, అధికారులు, స్థానిక నాయకులతో సమీక్షించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. తెలుగుదేశం ప్రభుత్వంలో షాజహాన్ తాజ్ మహల్ నిర్మించినట్లుగా, తాము పొడలకూరులో వాటర్ ప్లాంట్ నిర్మించామని, చంకలు గుద్దుకుంటూ చెప్పుకొచ్చిన మాటలు నీటి మూటలని తేలిపోయాయి. తెలుగుదేశం నాయకులు మా ప్రభుత్వం వచ్చాక అర్థాంతరంగా వాటర్ ప్లాంట్ ను నిలిపివేశామంటూ, గగ్గోలు పెట్టడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే, నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. పొదలకూరులో వాటర్ ప్లాంట్ మంజూరు చేసి,ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా, పనులు పూర్తి కాకుండానే, ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికి హడావిడిగా ప్రారంభోత్సవం చేసి, చేతులు దులుపుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తాము ప్రారంభించిన మినరల్ వాటర్ ప్లాంట్ కాంట్రాక్టర్ కు చెల్లించవలసిన 1 కోటి 20 లక్షల రూపాయలు నిధులు చెల్లించకుండా మొండిచేయి చూపిస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టర్ కు చెల్లింపులు చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారం వెలగబెట్టిన ప్రబుద్ధుడు మంజూరు కాగితాలు చేతిలో పెట్టి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఒక్క పైసా నిధులివ్వకుండా సిగ్గు లేకుండా మా పై విమర్శలు చేయడం హాస్యాస్పదం. అధికారంలో ఉన్నప్పుడు నిధులు ఇవ్వకుండా, ఓటమిపాలైన తర్వాత తాము ట్రస్ట్ ద్వారా అయినా నడిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు.వాటర్ ప్లాంట్ మంజూరు చేసి, బిల్లులు చెల్లించకుండా ప్రారంభోత్సవం పేరిట శిలాఫలకాలు వేసి, వదిలివేయడంతో ఎన్నికలు వచ్చిన తర్వాత, కాంట్రాక్టర్ ఎక్కడికక్కడ పనులు నిలిపివేశాడు తప్ప, మేమెవ్వరూ పనులు ఆపమని చెప్పలేదు.పొదలకూరు గ్రామ ప్రజలకు సమగ్రంగా తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించి, నిధులు ఇవ్వకుండా ప్రారంభోత్సవ శిలాఫలకం వేసి, పారిపోయిన దద్దమ్మల గురించి పట్టించుకోకుండా, అధికారులు, ప్రజలు, అవసరమని భావిస్తే వాటర్ ప్లాంట్ ను పూర్తి చేస్తాం. పొదలకూరు లో మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చలేకపోయినా, అధికారం కోల్పోయాక మినరల్ వాటర్ ప్లాంట్ ను అడ్డుపెట్టుకొని కోర్టులకు వెళ్లి పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను అడ్డుకోవడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించడం క్షమించరాని నేరం. సర్వేపల్లి నియోజకవర్గంలో తమ హయాంలో అభివృద్ధి చేయలేక చతికిల పడిపోయిన సందర్భంలో, నేడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తెలుగుదేశం పార్టీ హయాంలో లాగా నీరు-చెట్టు పేరుతో ప్రజల సొత్తు దోచుకున్న విధంగా కాకుండా ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను రెండో దఫా శాసనసభ్యునిగా 320 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు జల జీవన్ మిషన్ కింద 32 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించాము. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధాన రోడ్ల మరమ్మతులకు రోడ్లు మరియు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుండి 43 కోట్ల 65 లక్షల రూపాయలు మంజూరు చేయించాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధుల ద్వారా గ్రామాలకు వచ్చే ప్రధాన రహదారులను 16 కోట్ల 75 లక్షల రూపాయలతో చేపడుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండడంతో, గతంలో అభివృద్ధిని విస్మరించి, అవినీతికి పాల్పడిన వారు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి, అభివృద్ధిని అడ్డుకోవడం వారి నీచ సంస్కృతికి నిదర్శనం. సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమగ్రంగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.


1,035 Total Views, 4 Views Today