AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నేషనల్ హైవే 565 మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి…

1 min read

AABNEWS : పామూరు పట్టణ సమీపంలోని నెల్లూరు రోడ్డు జంక్షన్ వద్ద నేషనల్ హైవే 565 మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి,భోగ్యంవారిపల్లి గ్రామానికి చెందిన షేక్ సనీఫ్, షేక్ లతీఫ్, పూజల గణేష్ లు పట్టణంలోని ప్రవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కాలేజీ ముగించుకుని తమ వద్ద ఉన్న మోటార్ సైకిల్ మీద ఇంటికి వెళుతున్న తరుణంలో నెల్లూరు రోడ్డు జంక్షన్ వద్ద జాతీయ రహదారి 565 మీద వరికుంటపాడు వైపునుంచి పామూరు వైపు వస్తున్న మినీ వాహనం వీరు ప్రయాణిస్తున్న మోటారుసైకిల్ ను ఢీకొనడంతో మోటార్ సైకిల్ మీద ఉన్న నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన షేక్ సనీఫ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా వరికుంటపాడు మండలం భోగ్యంవారిపల్లి గ్రామానికి చెందిన షేక్ లతీఫ్, పూజల గణేష్ లకు తీవ్రగాయాల కాక అక్కడ ఉన్న స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇరువురిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు మృతి చెందిన సనఫ్ తండ్రి దుబాయ్ లో ఉంటున్నారని స్థానికులు తెలిపారు.

 587 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.