పవిత్ర మైన క్రిస్మస్ పండుగ…
1 min read
AABNEWS : ఎంతో పవిత్ర మైన క్రిస్మస్ పండుగ సందర్భంగా శుక్రవారం పలు చర్చిల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వాకాడు మండలం లోని తూపిలి పాళెం గ్రామంలో ఉన్న షారోన్ ప్రార్ధన మందిరంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పాస్టర్ పి.సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు, ఈ ప్రార్ధన కార్యక్రమంలో జెమిని కొత్త పాళెం, కొండూరు పాళెం, తూపిలి పాళెం గ్రామాలకు చెందిన క్రైస్తువులు, గ్రామస్తులు పాల్గున్నారు, ఈ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపార వేత్త మేకల అమాస్ ,గ్రామ కాపులు హాజరు అయ్యారు, వీరిని పాస్టర్ సుధాకర్ శాలువా లు కప్పి,పూల మాలలు వేసి ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా మేకల అమాస్ మాట్లాడుతూ యేసు జన్మించిన రోజును పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా క్రైస్తువులు జరుపుకుంటారు అనీ తెలిపారు, యేసు ఆశీస్సులతో ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు, స్థానిక చర్చిఆవరణలో పిల్లలు క్రీస్తు పుట్టుక లఘు నాటికను ప్రదర్శించారు. నృత్య రూపకాలు ప్రదర్శించి అలరించారు. అనంతరం పాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా దాతలు దాతృత్వం లోవృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపీణీ చేశారు అన్నారు, ఏసుప్రభు వలే ప్రతి ఒక్కరూ శాంతితో మెలిగి ప్రపంచశాంతికి బాటలు వేయాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరాలు కొత్త శోభనుసంతరించుకున్నాయి. వివిధ గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాటుచేసిన క్రిస్టమస్ స్టార్లో క్రైస్తవ ట్రీలు ప్రజలనుఎంతగానోఆకట్టుకున్నాయి,కార్యక్రమంలోజెమిని కొత్త పాళెం, కొండూరు పాళెం, తూపిలి పాళెం గ్రామాలకు చెందిన క్రైస్తువులు, పెద్దకాపు అప్పంగారి మహేంద్ర, రెండవ కాపు కె. జైరామయ్య, మూడవ కాపు వెంకటేశ్వర్లు, మాజీ కాపులు వెంకట రమణయ్య,
ఆర్కేటి గోపాల్, మహేంద్ర అయ్యగ్రామపెద్దలు,తదితరులు
121 Total Views, 2 Views Today