AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రస్తుత సమస్యలు మరియు పరిష్కారం” పై గెట్ టుగెదర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా…

1 min read

AABNEWS : స్థానిక రంగనాయకులపేటలోని రైల్ వీధిలోని M.S. స్కూల్ ప్రాంగణంలో “ప్రస్తుత సమస్యలు మరియు పరిష్కారం” పై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గెట్ టూగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి హుస్సేన్ పీరా మాట్లాడుతూ నేడు దేశం ఎదురుకొంటున్న సమస్యలపై ముస్లిం సమాజ పెద్దలు మరియు నాయకుల నుంచి పరిష్కారణ మర్గాలపై దేశవ్యాప్తంగా గెట్ టూగెదర్ ద్వారా చర్చలు జరుగుతున్నాయని .నేడు దేశం ఎదురుకొంటున్న సమస్యలను పరిష్కారించాలసిన బాధ్యత ముఖ్యంగా ముస్లిములపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన SDPI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ నేడు భారతదేశం 100 సంవత్సరాల క్రితం ఏ ఏ పరిస్థితులను ఎదురుకొనిందో అదే సమస్యలతో సతమతమౌతుంది. బ్రిటీష్ వాళ్ళు ఏవిధంగా జలియన్ వాలా బాగ్ పై కల్పులు జరిపారో అదేవిధంగా CAA-NRC-NPR సమయంలో షాహిన్ బగ్ పై కూడా కాల్పులు జరిగాయి. మానవహక్కుల కోసం ,స్వాతంత్ర్యం కోసం గళం విప్పిన వారిపై రౌలత్ చట్టం ప్రయోగించి అణిచివేసిన ఆంగ్లయుల లాగే నేడు ప్రజాస్వామ్య గొంతులను మూసివేయటానికి UAPA లాంటి నల్లచట్టాలను ప్రయోగించటం జరుగుతుంది.చివరికి దేశప్రజలకు ఆహరాన్ని పండించే రైతులను సైతం పొట్టకొట్టే చట్టాలు చేసి సామ్రాజ్యావాదులకు లబ్ధి చేకూర్చటం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో నేటి ఈ సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారణ మార్గాల ను కనుక్కోవాలని తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ ప్రస్తుత సమస్యలు వాటి పరిష్కార మార్గం కోసం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ముస్లిం సామాజిక నాయకులతో మరియు మతపెద్దలతో గెట్ టూగెదర్ కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని. మన నెల్లూరు లో వివిధ సంఘాలు ,సంస్థలు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ గెట్ టూగెదర్ కు విచ్చేసి తమ విలువైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

 310 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.