బుచ్చిరెడ్డిపాళెం ఐదు పంచాయతీలలో నామినేషన్ల…
1 min read
AABNEWS : బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గెండి.రఘురామయ్య గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెం రూరల్ మండలంలోని ఐదు పంచాయతీలలో నామినేషన్లను వేయడం జరిగింది.నాలుగు పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్ధులచే,ఐదు పంచాయతీలలో 9 వార్డులకు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులచే నామినేషన్ వేయడం జరిగింది.ఈ నామినేషన్ల కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గుండ్లపల్లి.భరత్ కుమార్ గారు విచ్చేసి జొన్నవాడ లో మొదటగా పెనుబల్లి పంచాయతీలోని 11వ వార్డుకు వై.రోశిరెడ్డి నామినేషన్ వేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం మునులపూడి పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా గెండి.పెంచల కృష్ణ,కట్టుబడిపాలెం పంచాయతీకి పెజ్జాయి.పుష్పావతమ్మ,ఇస్కపాళెం పంచాయతీకి బూదురు.కుమార్, పంచేడు పంచాయతీకి మోరా.వెంకటరమణమ్మను సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం.విజయ్ కుమార్ గారు,జిల్లా ఉపాధ్యక్షులు యం.సి.పెంచలయ్య గారు,ఓ.బి.సి జిల్లా అధ్యక్షులు ముక్కు. రాధాకృష్ణ గారు,మాజీ ఓ.బి.సి జిల్లా ఉపాధ్యక్షుడు జల్లి.పెంచలయ్య గారు,బి.జె.పి మండల ప్రధాన కార్యదర్శులు గంజం.పెంచల ప్రసాద్,వై.రోశిరెడ్డి, కోశాధికారి పెజ్జాయి.కృష్ణారెడ్డి గారు,సీనియర్ నాయకులు మాటేటి.రత్న ప్రసాద్ గారు,కాకు.మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు
233 Total Views, 2 Views Today