మద్యం బాటిళ్లు పట్టివేత…
1 min read
AABNEWS : స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు నేతృత్వంలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న తమిళ మద్యాన్ని పట్టుకొన్నారు. ఆ వివరాలను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు తెలిపారు. తమిళనాడు మద్యం రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతుందని సమాచారం అందడంతో చిట్ట మూరు ఎస్టి కాలనీ క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఈ బి పోలీసులు నిఘా పెట్టి పటుకున్నారు
ఈ క్రమంలో కోట మండలం తిన్నెల పూడి పంచాయతీ పరిధిలో ఉన్న లక్ష్మక్క కండ్రిగ గ్రామానికి చెందిన వరల కృష్ణయ్య 48 సంవత్సరాలు చెంబడి కులానికి చెందిన వ్యక్తి హోండా 5 జి యాక్టివ్ బైక్పై గోనుసంచిలో తరలిస్తున్న 94 తమిళం మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారని వివరించారు. అనంతరం ఆయన వాకాడు ఎస్ ఈ బి పోలీ్సస్టేషన్నుకు పరిశీలించారు. తమిళనాడు మద్యన్నీ తనిఖీ చేయాగ తమిళనాడుకు 94 హనీడై బ్రాందీ బాటిళ్లు గా గుర్తించి నిందితుడు కృష్ణయ్య పై క్రైం నంబర్ 85/2020 (ఎన్ డి పి ఎల్) కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ శేఖర్ బాబు తెలిపారు ఆయన వెంట ఎస్సై శశి కుమార్, కానిస్టేబుల్ లు రమణయ్య, రాధ కృష్ణ, మోహన్ తదితరలు ఉన్నారు.
26 Total Views, 2 Views Today