మహిళలను గౌరవించట మన ధర్మం ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్…
1 min read
AABNEWS : నెల్లూరు జిల్లా ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ నాయకులు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి హాఫిజ్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ “మహిళలను” గౌరవించడం మన ధర్మం మరియు భాద్యత అని నేడు ఏవిధంగా మహిళలపై ,చిన్నపిల్లలపై జరుగుతున్న దారుణాలు , అత్యాచారాలు మరియు హత్యల వలే 1400 సంవత్సరాల క్రితం సౌదీఅరేబియాలో ముఖ్యంగా మక్కా పవిత్ర నగరంలో మహిళలపై దారుణాలు జరిగినాయి .ఇలాంటి తరుణంలో స్రృష్టీకర్త అల్లాహ్ జగత్ప్రవక్తా ముహమ్మద్ సొలెల్లాహు అలైహి వసల్లం గారికి పవిత్ర ఖురాన్ అందించారు .ఈ పవిత్ర ఖురాన్ ప్రకారం జీవినం గడపటం మొదలైన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సొలెల్లాహు అలైహి వసల్లం జీవితకాలం తర్వాత ప్రపంచ ఆ రోజు ను కూడా చూసింది ఒక ఒంటరి మహిళా “సనా” నగరం నుంచి హజరేమౌతా నగరం వరకు బంగారు ఆభరణాలు ధరించి మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం చేసింది.ఎందుకంటే అప్పుడు ఆ మహిళ మనస్సు లో అల్లాహ్ తప్ప ఇతరుల భయం లేదు అలాగే ప్రజలు అల్లాహ్ మరియు ప్రళయం దినం గురించి భయపడేవారు. నేడు మనుషులలో అల్లాహ్(స్రృష్టీకర్త) భయం చనిపో యింది .నేడు వ్యవస్థ ను ,cc కెమెరాలను భయపడుతున్నారు గాని దైవభ్రితి లేదని ఆవేదన తెలిపారు. ఇస్లాం ధర్మం లో మహిళలకు ఎంతో రక్షణ మరియు ఉన్నత స్తానం ఉందని. మహిళలను కేవలం మహిళా దినోత్సవం నాడు శుభాకాంక్షలు తెలపడమె కాదు .ప్రతి దినం మహిళల హక్కుల కోసం ,వారి శ్రేయస్సు కోసం మరియు రక్షణ కోసం ప్రతి ఒక్కరు క్రృషి చేయాలని తెలిపారు – అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. ఈ చేష్టలకు ఒడిగట్టినవాడు పాపఫలాన్ని పొంది తీరుతాడు.(ఖురాన్25:68)ఈ కార్యక్రమంలో మౌలానా అయ్యూబ్ “ముఫ్తి అబ్దుల్ రెహమాన్, హాఫిజ్ ఆజమ్, హాఫిజ్ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు
176 Total Views, 2 Views Today