AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైస్సార్సీపీ నాయకులతో…

1 min read

AABNEWS : రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైస్సార్సీపీ నాయకులతో, యువకులతో మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసి,చర్చించటం జరిగింది.సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు తిరుపతి లోకసభా స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక సందర్బంగా సర్వేపల్లి శాసనసభ్యులు మా ప్రియతమ అన్నగారు గౌ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు , మరియు ఆంధ్రప్రదేశ్ విద్యశాఖమాత్యులు “గౌ ‘శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మనుబోలు లో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి కట్టువపల్లి వైస్సార్సీపీ నాయకులు, యువకులను దాదాపుగా 50 మందిని తీసుకెళ్లాటం జరిగింది.శ్రీ ఆదిమూలపు సురేష్ గారు నియోజకవర్గాన్ని ఉద్దెశించి రాబోవు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయడంఖా మోగించాలని,వైస్సార్సీపీ పార్టీ బలపరిచిన “శ్రీ గురుమూర్తి గారికి” అత్యధిక మెజారిటీ కట్టబెట్టాలని వారు ఆశించారు.మంత్రివర్యులు మన అన్నగారిని ఉద్యేశించి నియోజకవర్గం లో గొప్పనాయకుడిగా , పార్టీ నాయకులలో గొప్ప గుణవంతుడిగా , అందరికి మార్గదర్శిగా శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నిలిచారని కొనియాడారు .కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కార్యకర్తలను, యువకులను ఉద్యేశించి రాబోవు MPTC , ZPTC, తిరుపతి MP స్థానాలను వైస్సార్సీపీ కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. వైస్సార్సీపీ పార్టీ అభ్యునతికి, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి శ్రేయస్సు కు పాటు పడే ప్రతీ కార్యకర్తకు, నాయకులకు, యువకులకు నా ధన్యవాదములు. రాబోవు ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీకి పట్టం కడుతారని ఆశిస్తూ కృతజ్ఞతలతో..ఇట్లు.. మీ గుండాల ఆదినారాయణ వైస్సార్సీపీ యువనేత , చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు

 2,455 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.