AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతుల ట్రాక్టర్ ర్యాలికి మద్దతు ను ప్రకటిస్తు రైతు చట్టాలను రద్దుచేయాలని…

1 min read

AABNEWS : రైతుల ట్రాక్టర్ ర్యాలికి మద్దతు ను ప్రకటిస్తు రైతు చట్టాలను రద్దుచేయాలని పాపులర్ ఫ్రంట్ డిమాండ్ స్థానిక మన్సూర్ నగర్ లోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని మరియు గణతంత్ర దినోత్సవమున రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలికి పాపులర్ ఫ్రంట్ తన సంపూర్ణ మద్దతు తెల్పుతుందని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ O.M.A.సలాం గారు తెలిపారన్నారు. ఈ మద్య కాలంలో చేసిన రైతు నల్లచట్టాలను రద్దు చేయాలని గత రెండు మాసాల పైగా రోడ్ల పై నిరసనలు తెల్పుతున్న రైతులతో ఇప్పటి వరకు 11సార్లు చర్చలు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిన అవి దుర్బలమైనాయి.వాస్తవాలను గమనిస్తే ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి మంచి అభిప్రాయం లేదు. చేసిన నల్లచట్టాలను రద్దు చేయకుండా చర్చలు అని ప్రతి సారి పిలిచి కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనలను నీరుగార్చి ఆ నల్లచట్టాలను రుద్దాలని చూస్తున్నాయి. హిందుత్వ ఫ్యాసిస్టు శక్తులు మరియు కేంద్ర ఏజెన్సీలు శాంతియుతంగా మరియు ప్రజాస్వామ్యాబద్దంగా రైతులు నిర్విహిస్తున్న నిరసనలపై విషాన్ని కక్కుతున్నాయి.వీరి ఈ నీచ ప్రయత్నాలు ఎన్నటికీ రైతుల లక్ష్యాన్ని మరియు రైతుల అభివృద్ధి ని ఎన్నటికి ఆపలేవం.దినదినమున దేశంలో రైతులకు మద్దతు పెరుగుతు నూతన చరిత్ర లిఖించబడుతుంది.
పాపులర్ ఫ్రంట్ తన మద్దతు ను రైతులకు తెల్పుతు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది.

 191 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.