AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని అప్పీల్…

1 min read

AABNEWS :

రైతుల డిమాండ్ కు పాపులర్ ఫ్రంట్ వెంటవుంది -రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని అప్పీల్ చేస్తుంది.నెల్లూరు స్థానిక మన్సూర్ నగర్ లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ నిరసన తెలుపుతున్న రైతులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తన సంపూర్ణ మద్దతు తెల్పుతుందని ,దేశంలో రైతులకు వ్యతిరేకంగా చేసిన విమర్శనాత్మకమైన మూడు రైతు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ కమిటీ రెజ్యులేషన్ ను పాస్ చేసి డిమాండ్ చేసిందని తెలిపారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ మూడు నల్ల చట్టాలను తాత్కాలికంగా నిలిపివేశి దీనిపై క్షుణ్ణంగా పరిశీలించటానికి నలుగురు సభ్యుల కమిటీ ని వేయడం జరిగింది. కొన్ని మీడియా వర్గాలు సుప్రీంకోర్టు రైతుల పక్షాన ఉందని చిత్రికరిస్తున్నారు.వాస్తవంగా రైతు సంఘాలు ఈ నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నాయి. సుప్రీంకోర్టు నియమించినఈ కమిటీ లో నలుగురు సభ్యులు లో ఏ ఒక్కరు కూడా రైతుల పక్షాన లేడు ఆ నలుగురు ప్రభుత్వ నామినిగా ఉండి ఆ నల్ల రైతు చట్టాలను సహకరించేవారు. ఈ కమిటీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు ఎందుకంటే వారు నూటికి నూరు శాతం ఆ నల్ల రైతు చట్టాలకు మద్దతు తెలుపుతారు. ఈ కమిటీ నియమకం కేవలం శాంతియుతంగా ,ప్రజాస్వామ్య బద్దంగా నిరసనలు తెల్పుతున్న రైతులను బలవంతంగా నిరసనల నుంచి ఇంటికి పంపించటానికి జరుగుతున్న కుట్ర.ఏ విధంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను నిలిపివేయటానికి ఎలాంటి కుట్రలు జరిగినాయో అలాంటిదే.
ప్రభుత్వం బేషరతుగా దేశవ్యాప్తంగా రైతులు తిరస్కరిస్తున్న ఆ
మూడు రైతు చట్టాలను వాపసు తీసుకోవాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తు రైతులకు తన సంపూర్ణ మద్దతును తెల్పుతుంది. దేశ పౌర సమాజం మరో ప్రజాస్వామ్యా నిరసనను విఫలం కాకుండా చూడాలని అందువల్ల దేశ ప్రజలందరు రైతు పక్షాన్న నిలబడాలని పిలుపునిస్తుంది.

 523 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.