AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వరకట్నం” అనే మహా పాపాన్ని మరియు సామాజిక నేరాన్ని అంతం చేయాలి

1 min read

AABNEWS : వరకట్నం” అనే మహా పాపాన్ని మరియు సామాజిక నేరాన్ని అంతం చేయాలి : ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్:
నెల్లూరు స్థానిక మనమసుద్దినగర్ లోఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ సమావేశం లోనెల్లూరు జిల్లా నాయకులు ఈ మధ్యకాలంలో జరిగిన ఆయిషా వరకట్న హత్య పై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు. జిల్లా కార్యదర్శి హాఫిజ్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ వరకట్నం అనేది కేవలం ఇస్లాం మతం ప్రకారం కేవలం పాపమే కాదు ఒక చట్టరీత్య నేరం కూడా అయిన నేడు వరకట్నం తీసుకొంటు మహిళను వివాహం చేసుకోవాలంటే పెళ్ళి కూతిరి తల్లిదండ్రులను కట్నం ఎంత ఇస్తారు ? ఇంత కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుంది లేకపోతే పెళ్లి జరగదు.ఎన్నో కష్టాల తర్వాత వరకట్నం ఇచ్చిన ఇంకా వరకట్నం కావాలని అమ్మాయిలను వేధించటం ఇస్లాం ,ఖురాన్ వ్యతిరేకమే కాదు మానవత్వానికి మచ్చ అని. వరకట్నం కారణంగా నేడు ఎంతోమంది పేద అమ్మాయిలు పెళ్ళిలు జరగకుండా తమ తల్లిదండ్రులపై భారమైనామా అని కన్నీరు పెట్టుకొంటున్నారు.కొంతమంది తల్లిదండ్రులు పొట్టకొట్టుకొని ఎన్నో కష్టాలు పడి తమ అమ్మాయికి పెళ్ళి చేసిన మానవత్వం మరిచి క్రూరమ్రృగాలుగా ప్రవర్తించే అత్తమామలు వేధింపులు మరియు బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుందని. ఈ మహాపాపాన్ని అందరూ ఖండించాలని. నేడు యువతరం వరకట్నానికి వ్యతిరేకంగా నిలబడాలని ముఖ్యంగా ఉలమాలు ,ఇమాములు మరియు మతగురువులు, మసీదు కమిటీలు, వరకట్నానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలని. వరకట్న పెళ్ళిలు మేము జరపము అని ఒక వేళ ఎవరైనా వరకట్న పెళ్ళిలు చేసుకొన్న అలాంటి వారికి జనాజా నమాజు జరిపించము మరియు ముస్లిం శ్మశాన వాటికలో స్థలం యివ్వమని ప్రతిజ్ఞ చేయాలని .మతగురువులు ఈ విషయం పై తీవ్రంగా స్పందించాలని ఈ దుర్మార్గపు వరకట్నాని అంతం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ముఖ్యంగా మతగురువులు ,ఉలమాల బాధ్యత అని.దీనిపై అల్లాహ్ ప్రళయదినమున ప్రశ్నిస్తున్నారని తెలిపారు. వరకట్నం అనే సామాజిక రుగ్మతను ,మహాపాపాన్ని అందరు కలిసి అడ్డుకోవాలని ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ పిలుపునిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముక్తి అబ్దుల్ రెహమాన్, హాఫిజ్ నయాజ్, ఆజమ్, హాఫిజ్ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు

 579 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.