September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విలేకర్లతో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు…

1 min read

AABNEWS : నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల లోని అన్ని కార్యక్రమాలను నెరవేరుస్తున్నారు.మొదటగా రైతుభరోసా ను సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రారంభించడం జరిగింది నవరత్నాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని నెల్లూరులోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటి ఉపయోగం, లబ్ధి ప్రజలకు చెందకుండా ఉండాలనే దుర్మార్గపు ఆలోచనతో తెలుగుదేశం నాయకులు గందరగోళ పరిస్థితిని నెలకొల్పుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ను గౌరవిస్తాం, కానీ నిమ్మగడ్డ రమేష్ చర్యలను మేము ఖండిస్తున్నాం. కరోనాకు సంబంధించి సెకండ్ వేవ్ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలో ఉన్న సమయంలో ప్రభుత్వ సూచనలను పక్కనబెట్టి, నిమ్మగడ్డ రమేష్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సమంజసం కాదు. ఐ.ఏ.యస్. అధికారిగా సుధీర్ఘ అనుభవం ఉండి, మంచి వ్యవస్థకు అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం తగదు. స్థానిక ఎన్నికలపై న్యాయస్థానంలో వాదనలు జరుగుతున్న తరుణంలో న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూడకుండా నోటిఫికేషన్ విడుదల చేసి న్యాయ వ్యవస్థను ఉల్లంఘించారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుండి అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆపమనడానికి ఎన్నికల కమిషన్ కు హక్కు ఉందా!.ఎందరో తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నగదు జమ కాబోతున్న తరుణంలో కార్యక్రమాన్ని ఆపమనడం, పేద వారి సొంతింటి కల అయిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని నిలిపి వేయాలని చెప్పడం ఎంతవరకు రాజ్యంగ బద్ధం!. ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న పథకాలు కావు, జరుగుతున్న పధకాలు, ఎన్నికల కమిషన్ అడ్డుకోవలసిన అవసరం ఏం ఉంది!. సార్వత్రిక ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరుణంలో… తెలుగుదేశం ప్రభుత్వం మూడు విడతల్లో చేపట్టిన పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపడుతుంటే, “ఆన్ గోయింగ్ ప్రోగ్రాం” అమలు చెయ్యవచ్చు అన్న భారత ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను నిమ్మగడ్డ రమేష్ మర్చారా!. నిమ్మగడ్డ రమేష్ కు తెలుగుదేశం పార్టీతో లోపాయికారీ సంబంధాలున్నాయి. కానీ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలను అడ్డుకోవడం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా స్థానిక ఎన్నికలు జరిగిన దాఖలాలు ఉన్నాయా!. నిమ్మగడ్డ రమేష్ మాటలను తాము పట్టించుకొము, రేపు యధావిధంగా ముఖ్యమంత్రి గారి రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్న రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు ప్రజలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము…

 249 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.