వైకాపా అభ్యర్థి గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్లో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ చక్రధర్బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు…
1 min read
AABNEWS :నెల్లూరు: తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా వైకాపా అభ్యర్థి గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్లో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ చక్రధర్బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకు ముందు వీఆర్సీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆదిమూలపు సురేశ్, గౌతం రెడ్డి, అనిల్ కుమార్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో మమేకమయ్యారు. కాగా, తెదేపా నుంచి పనబాక లక్ష్మి, భాజపా-జనసేన తరఫున అభ్యర్థి రత్నప్రభ ఈ లోక్సభ ఉప ఎన్నిక బరిలో ఉన్న విషయం తెలిసిందే.
223 Total Views, 4 Views Today