వైయస్సార్ కాంగ్రెస్లోకి భారీగా వలసలు…
1 min read
AABNEWS : నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు.
వెంకటాచలం మండలం, గుడ్లూరువారి పాళెంకు చెందిన ఈపూరు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 600 కుటుంబాలు. ఈపూరు మురళీధర్ రెడ్డి చేరిక సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రంలో ఎంత మంది ముఖ్యమంత్రు లు పాలించినా… ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. మహానేత మరణాంతరం వచ్చిన ముఖ్యమంత్రులు సమర్థవంతంగా పనిచేసిన దాఖలాలూ లేవు. కానీ ఇప్పుడు మహానేత బిడ్డాగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కంటే మిన్నగా పాలిస్తున్నారు.
వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడానికి, దశాబ్దాలుగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అభినందనీయం. గతంలో పెత్తనం వెలగబెట్టిన వారు అభివృద్ధి పై దృష్టి పెట్టకుండా గ్రామాల్లో వర్గాలను సృష్టించి, ప్రజల మధ్య చిచ్చు పెట్టి, పబ్బం గడుపుకున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ ఒకతాటిపై నడిచి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, మరింత అభివృద్ధిని సాధిద్దాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి పని చేసిన నాయకులు, కార్యకర్తలు కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా నడుచుకుందాం. ఉన్నతమైన నిర్ణయం తీసుకున్న ఈపూరు మురళీధర్ రెడ్డి తో పాటు ఆయన వెంట నడిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 600 కుటుంబాల సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా.
56 Total Views, 2 Views Today