AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సర్వేపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన కాకాని…

1 min read

AAB NEWS : నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించి, సర్వేపల్లి రిజర్వాయర్ ను పరిశీలించి, ముంపుకు గురైన కాలనీలలో పర్యటించి, అధికారులతో పరిస్థితిపై సమీక్షించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, పాల్గొన్న నెల్లూరు ఆర్డీఓ హుసేన్ సాహెబ్ గారు.

స్క్రోలింగ్ పాయింట్స్:

👉 తుఫాను ప్రభావంతో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.

👉 సర్వేపల్లి రిజర్వాయర్ బలహీనంగా ఉన్నందున ఎక్కువ నీరు నిలువ చేయకుండా దిగువకు విడుదల చేస్తున్నాం.

👉 ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన భోజన, వసతి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.

👉 పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు.

👉 వరి నార్లు, వరినాట్లు ముంపుకు గురి కావడంతో, వర్షాలు ఆగిన వెంటనే నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించి, నష్ట పరిహారాన్ని మంజూరు చేయించి, రైతులకు అందజేస్తాం.

👉 రైతులు ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేకుండా అన్ని విధాలా అండగా నిలుస్తాం.

👉 వర్షం ఉద్రిక్తత కారణంగా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.

👉 రోడ్ల పై చెట్లు పడుతున్నందున, విద్యుత్ వైర్లు తెగి పడుతున్నందున పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

👉 మరో 48 గంటలు తుఫాను ప్రభావం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో మరింత వరద నీరు చేరే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడ అడ్డు కట్టలు వేసి, వరదనీరు గ్రామాల్లో చేరకుండా సముద్రంలోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం.

👉 రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్న అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు నా ధన్యవాదాలు.

👉 తుఫాను ప్రభావం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, నిరంతరం సమీక్షిస్తూ, ఏ అవసరం వచ్చినా ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తాం.

 160 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.